ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అయితే క్రికెట్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నట్లే ప్రతి ఒక అభిమాని కి కొంతమంది స్టార్ ప్లేయర్ లో ఫేవరెట్ ప్లేయర్ ఉంటారు . ఇలా ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుని ఫేవరెట్ ప్లేయర్ గా మారిపోయిన ఆటగాడు డుప్లేసిస్. సౌత్ ఆఫ్రికా స్టార్ ప్లేయర్ అయినా డుప్లేసెస్... ఎన్నో మ్యాచ్ల్లో అద్భుత రికార్డులను కొల్లగొట్టాడు. ఇక 100 సిరీస్  మ్యాచుల్లో డక్ అవుట్ కాకుండా ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు డుప్లేసెస్. ఒకసారి మైదానంలోకి దిగితే అద్భుతమైన ఆట ప్రదర్శనతో ప్రేక్షకులందరినీ హోరెత్తిస్తుండేవాడు. 

 

 

 జట్టు విజయంలో ఎన్నోసార్లు కీలక పాత్ర పోషిస్తూ జట్టును విజయతీరాలకు తెచ్చిన గొప్ప ఆటగాడు డుప్లేసెస్. అందుకే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు అందరూ కలిసి దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ డుప్లెసిస్ ఆట  చూడడానికి ఎంతో ఆసక్తి చూపుతుంటారు. డుప్లేసెస్ జట్టులో ఉన్నాడు అంటే విజయం ఖాయం అని సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు కూడా నమ్ముతుంటారు. ఎన్నో ఏళ్ల నుంచి క్రికెట్ లో కొనసాగుతున్న డుప్లెసిస్... తన అద్భుతమైన ప్రదర్శన తో ఎంతో మంది క్రికెట్ అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఎన్నో రికార్డులు సైతం కొల్లగొట్టాడు ఈ ఆటగాడు. 

 

 

 ఇకపోతే ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ అయిన డుప్లెసిస్ రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు తెలుస్తుంది. ఇంగ్లాండ్ తో  జరిగిన టెస్ట్ సిరీస్ తర్వాత దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ డుప్లేసెస్ తన రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని అతని సన్నిహితుల నుంచి సమాచారం. కాగా డుప్లెసిస్ గత కొంతకాలంగా సరైన ఫామ్ లో  లేకపోపోవటం పేలవ  ప్రదర్శన చేస్తూ ఉండడంతో పాటు... కెప్టెన్ గా  ముందుండి జట్టును నడిపించలేకపోతున్నాడు. ఏకంగా డుప్లెసిస్ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా జట్టు వరుస పరాజయాలు మూటగట్టుకుంది. వరల్డ్ కప్ తర్వాత 8 వన్డే టేస్ట్ సిరీస్ లు ఆడగా 7 ఓటమిలు  చవిచూసింది దక్షిణాఫ్రికా జట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: