రేపటి నుంచి టీమిండియా న్యూజిలాండ్ మధ్య  వరుసగా సిరీస్లో జరగనున్న  విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ బ్యాటింగ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. గతంలోనే కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ సామర్థ్యం అసాధారణమైనది అంటూ ప్రశంసించిన విరాట్ కోహ్లీ... మరోసారి కేన్ విలియమ్సన్ ను  కొనియాడారు. ప్రపంచ క్రికెట్లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ చాలా స్మార్ట్ క్రికెటర్ అంటూ  విరాట్ కోహ్లీ ప్రశంసించారు. ఒక కెప్టెన్గా కేన్ విలియమ్సన్ జట్టును ముందుండి నడిపించడంలో అందరికంటే భిన్నంగా వ్యవహరిస్తూ  ఉంటాడని  తెలిపాడు. 

 


 ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో న్యూజిలాండ్ జట్టు పరాజయం పాలైన ప్పటికీ... అది కెప్టెన్ విలియమ్సన్ వైఫల్యం వల్ల మాత్రం కాదు అంటూ చెప్పుకొచ్చాడు. లీడర్షిప్ ని జట్టు సాధించే ఫలితాన్ని బట్టి నిర్ణయించ కూడదు అని విరాట్ కోహ్లీ అన్నాడు. ఒక జట్టుగా సమిష్టిగా విఫలమైతేతే   పరాజయాలు చవి చూడాల్సి వస్తుంది  అంటూ తెలిపారు. అక్కడ కెప్టెన్సీకి అసలు సంబంధమే లేదు అంటూ కేన్ విలియమ్సన్ ని వెనకేసుకొచ్చారు విరాట్ కోహ్లీ. జట్టు సారథిగా... కేన్ విలియమ్సన్ జట్టు ను నడిపించే తీరు అద్భుతంగా ఉంటుంది అంటూ కొనియాడాడు విరాట్ కోహ్లీ.అంతేకాకుండా  కేన్ విలియమ్సన్ జట్టులోని అందరు సభ్యులకు అమితమైన గౌరవం ఇవ్వడం తో పాటు అందరిపైనా ఎంతో నమ్మకంతో వున్నారు అంటూ పేర్కొన్నాడు. 

 


 కాగా  టీమ్ ఇండియా న్యూజిలాండ్ పై వరుస సిరీస్లలో గెలవడం పైనే దృష్టి సారించినట్లు కోహ్లీ చెప్పుకొచ్చాడు. కాగా న్యూజిలాండ్ టీమిండియా మధ్య శుక్రవారం నుంచి సిరీస్ను ప్రారంభం కానుండగా. ఐదు టి20 సిరీస్ లతో పాటు మూడు వన్డే సిరీస్ లు  రెండు  టెస్టు సిరీస్ లు  కూడా... న్యూజిలాండ్ టీమిండియా జట్ల మధ్య జరగనున్నాయి. కాగా ప్రత్యర్థి జట్టుకు కెప్టెన్ అయిన కేన్ విలియమ్సన్ పై విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించడంతో విరాట్ కోహ్లీ అభిమానులందరూ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు సిసలైన స్పోర్టివ్ నెస్ అంటే  ఇదే కదా అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: