వరుస సిరీస్ లతో దూసుకుపోతున్న టీమిండియాను ఓడించే టీమ్  ఎదురవ్వటం  లేదు. అత్యంత దృఢమైన  జట్టులను  కూడా చిత్తుగా ఓడిస్తూ వరుస సిరీస్ లను  కైవసం చేసుకుంటూ దూసుకుపోతుంది టీమిండియా. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో టీమిండియా ఓడిపోతుందని అందరూ అనుకున్నారు కానీ... అద్భుత ప్రదర్శన చేసి ఆస్ట్రేలియా లాంటి దృఢమైన జట్టును కూడా మట్టికరిపించింది టీమిండియా జట్టు. మరోసారి ఆస్ట్రేలియా ని ఓడించి టీమిండియాకు తిరుగులేదు అని నిరూపించింది. ఇక నేటినుంచి న్యూజిలాండ్తో టీమ్ ఇండియా వరుస  సిరీస్లను ఆడనున్న విషయం తెలిసిందే. టీ20 వన్డే టెస్ట్ సిరీస్ లను వరుసగా న్యూజిలాండ్తో ఆడనుంది టీమిండియా. ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు అందరూ న్యూజిలాండ్ బయల్దేరాక నేడు మ్యాచ్ ప్రారంభమైంది కూడా. 

 

 ఇకపోతే న్యూజిలాండ్ ను కూడా చిత్తు చేసి ద్వైపాక్షిక సిరీస్ లను గెలుచుకోవాలని టీమిండియా సన్నద్ధమైంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్తో మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.ఒకే చోట రెండు దేశాల మధ్య ఒకే రోజులో మూడు మ్యాచ్లు జరగడం ఎప్పుడైనా చూసారా... అలాంటి మ్యాచ్ ఇప్పుడు వరకు క్రికెట్ ప్రేక్షకులు చూసి ఉండరు. కానీ మొదటిసారి ప్రస్తుతం న్యూజిలాండ్ లో జరుగుతుంది. భారత్ కు చెందిన క్రికెట్ టీం లు న్యూజిలాండ్ జట్టుతో అదే దేశంలో ఒకే  రోజు మూడు మ్యాచ్లు ఆడుతున్నాయి. ఇలా జరగడం చరిత్రలోనే మొదటి సారి. 

 


 భారత్ న్యూజిలాండ్ మధ్య ఒకే రోజు మూడు మ్యాచ్లు జరుగుతుండడం విశేషం. అయితే ఈ  మూడు మ్యాచ్ లు ఆడేది  కోహ్లీసేన ఒక్కటే కాదు . ఈరోజు 12 గంటల 20 నిమిషాలకు న్యూజిలాండ్తో కోహ్లీసేన తొలి టీ-20 మ్యాచ్లు ఆడనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన మ్యాచ్ ప్రారంభం అయింది కూడా... అంతేకాకుండా ప్రపంచకప్లో భాగంగా భారత అండర్-19 యువ ఆటగాళ్లు న్యూజిలాండ్తో 1:30 గంటలకు... తలపడనున్నారు. ఇక తెల్లవారుజామున 3:30 గంటలకు... భారత్ ఏ  జట్టుతో కివీస్ ఏ  జట్టు అనధికారిక వన్డే మ్యాచ్ ఆడుతోంది. దీంతో చరిత్రలోనే తొలిసారి చిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఒకే దేశంలో ఒకే రోజు ఒకే టీం తో భారత్ మూడు మ్యాచ్లు ఆడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: