బుల్లెట్ లాంటి బంతులతో... ఎన్నో మెరుపులు మెరిపిస్తూ... ఎన్నో అద్భుతాలు సృష్టిస్తూ... తనదైన ఆటతో జట్టుకు విజయాన్ని చేరువ చేస్తూ దూసుకుపోతున్న ఆటగాడు మహమ్మద్ షమీ. జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత తనకు తిరుగు లేదు అని నిరూపిస్తున్నారు. తనదైన స్టైల్ పదునైన బౌలింగ్ తో జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు మహమ్మద్ షమీ. మునుపెన్నడూ లేనివిధంగా మహమ్మద్ షమీ బౌలింగ్ లో రాటు  తేలాడు. తన స్వింగ్ బౌలింగ్ తో దిగ్గజ ఆటగాళ్లను సైతం కవ్విస్తూ వికెట్లు పడగొడుతున్నాడు.  ప్రస్తుతం టీమిండియా లో మహ్మద్ షమి కీలక బౌలర్ గా మారారు అనడంలో అతిశయోక్తి లేదు. 

 

 

 ఇక మొన్నటికి మొన్న న్యూజిలాండ్ టీమిండియా మూడో టీ20 మ్యాచ్ లో సూపర్ ఓవర్ లో  అద్భుతమైన బౌలింగ్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు మహమ్మద్ షమీ. ఇకపోతే తాజాగా మొహమ్మద్ షమీ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టి  బావోద్వేగానికి లోనయ్యారు. తన కూతురిని చూసి మురిసి పోయాడు మహమ్మద్ షమీ. ఇంతకీ మహమ్మద్ షమీ అంత ఆనంద పడి పోవడానికి కారణం ఏమిటో తెలుసా. టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ కూతురు... ఎల్లో కలర్ చీరల ధరించిన ఫోటోను నాన్న షమీకి సెండ్ చేసింది. 

 

 

 ఇక తన కూతురు చీరలో ఉన్న ఫోటోలు చూస్తే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు  మహ్మద్ షమి. వెంటనే ఆ ఫోటోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఈ చీరలు ఎంత అందంగా కనిపిస్తున్నావు... ముద్దు పెట్టుకోవాలని పిస్తుంది తల్లి.. నిన్ను చాలా మిస్ అవుతున్నా త్వరలోనే కలుస్తాను అంటూ క్యాప్షన్ జత చేసి పోస్ట్ చేశాడు మహమ్మద్ షమీ. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇకపోతే ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న టి20 సిరీస్ భాగంగా 4 మ్యాచ్  గురించి మొహమ్మద్ షమీ సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: