టీమ్ ఇండియా వరుస  సిరీస్ను గెలుచుకుంటూ  తమ సత్తా చాటుతూ  దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రత్యర్థి జట్టు ఎవరైనా చిత్తు చేస్తూ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంటుంది ఇండియా. డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమ్ ఇండియా జట్టు మరింత పటిష్టంగా మారిపోయింది. ఇక తాజాగా న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్ లో టీమిండియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మొదట వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా... ఆ తర్వాత మిగిలి ఉన్న మరో రెండు టి20 మ్యాచ్ లు కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావించింది. ఈ నేపథ్యంలోనే పట్టుదలతో ముందుకు సాగి ... ఆటగాళ్లు అందరి సమిష్టి కృషితో ఐదు టి20 మ్యాచ్ లను వరుసగా గెలిచి అద్భుత రికార్డు సాధించిన విషయం తెలిసిందే. 

 

 

 విదేశాలలో ఇలాంటి రికార్డు సాధించడం ఇదే తొలిసారి. ఇకపోతే ఐదు టీ20 సిరీస్ లలో .. టీమిండియా  న్యూజిలాండ్ బౌలర్లు ధాటికి కాస్త ఇబ్బంది పడుతూనే ఆడిన విషయం తెలిసిందే.. మొదట భారత బ్యాట్స్మెన్లు అందరూ రెచ్చిపోయి భారీ  షాట్లు ఆడినప్పటికీ ఆ తర్వాత స్కోర్ బోర్డు మాత్రం నత్తనడకన నడిచింది. ఈ నేపథ్యంలోనే 164 పరుగుల టార్గెట్ న్యూజిలాండ్ జట్టు ముందు ఉంచింది టీమిండియా. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు మొదట ఓవర్లలో దూకుడుగా ఆడి విజయం సొంతం చేసుకునేట్లు కనిపించింది. ఆ తర్వాత బౌలింగ్ వేసిన జస్ప్రిత్ బూమ్రా.. మాయ చేశాడు అనే చెప్పాలి. ఐదో టి20 మ్యాచ్ లో మూడు వికెట్లు పడగొట్టిన జస్ప్రిత్ బూమ్రా కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చిన ఒక మెయిడెడ్  ఓవర్ కూడా సాధించాడు. 

 

 

 

 అయితే ఐదో టి20 విజయంలో జస్ప్రిత్ బూమ్రా కీలక పాత్ర వహించాడు. ఇకపోతే తాజాగా పాకిస్తాన్ పేస్ బౌలింగ్ దిగ్గజమైన షోయబ్ అక్తర్ జస్ప్రిత్ బూమ్రా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తారు.  న్యూజిలాండ్తో జరిగిన చివరి 20 మ్యాచ్లో ఇండియా విజయం సాధిస్తుందని తాను అనుకోలేదు అంటూ తెలిపాడు పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్.  తొలి 10 ఓవర్లలో  కివీస్ ఆటగాళ్ల దూకుడు చూసిన తర్వాత ఆ జట్టు విజయం సాధిస్తుందని తాను అనుకోలేదు  అంటూ చెప్పుకొచ్చాడు. అయితే న్యూజిలాండ్ టి20 సిరీస్ దక్కించుకోవడానికి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ యే  కారణం అని... క్రెడిట్ మొత్తం అతనికే దక్కుతుంది అంటూ వ్యాఖ్యానించాడు షోయబ్ అక్తర్. గాయం  తర్వాత జట్టులోకి వచ్చిన బుమ్రా  మరింత అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు అంటూ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: