క్రికెట్ చూసే  అభిమానులు అందరూ ఇది నిజమా కల అనిపించేలా కొన్ని కొన్ని సార్లు ఆటగాళ్లు ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఇలాంటిదే జరిగింది టీమ్ ఇండియా న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో. అటు టీమిండియా నుంచి శ్రేయాస్ అయ్యర్  సెంచరీ చేసి అదరగొడితే..మరో వైపు  న్యూజిలాండ్ నుంచి రాస్ టేలర్ సెంచరీ తో దుమ్ము లేపాడు. అయితే సెంచరీ దేముంది అందరూ చేస్తూ ఉంటారు అంటారా... అయితే ఆటగాళ్లు తరచూ సెంచరీలు చేస్తూనే ఉంటారు కానీ మిడిలార్డర్ ఆటగాళ్లకు  మాత్రమే సెలెక్ట్ చేయడానికి తగిన సమయం కానీ.. ఓవర్లు కానీ  ఉండవు. ఇక్కడ ఇద్దరు మిడిలార్డర్ బ్యాట్స్మెన్ లు  సెంచరీలు  పూర్తి చేసి రికార్డు సృష్టించారు. మామూలుగా అయితే వన్డే ఫార్మాట్లో ఓపెనర్లు గా  వచ్చిన ఆటగాళ్లు మాత్రమే సెంచరీ  ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ డౌన్లో వచ్చిన ఆటగాళ్ళు నాలుగో స్థానంలో వచ్చిన ఆటగాళ్లు  హాఫ్ సెంచరీ చేస్తారు. 

 

 కానీ మిడిలార్డర్లో వచ్చి సెంచరీ చేయాలంటే మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేయాల్సిందే. కానీ టీమ్ ఇండియా న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో మాత్రం రెండు జట్ల కు చెందిన మిడిలార్డర్ ఆటగాళ్ళు... సెంచరీలు చేసి అదరగొట్టారు. టీమిండియాలో శ్రేయస్ అయ్యర్ చేసిన సెంచరీ ప్రత్యర్థి జట్టుకు భారీ టార్గెట్ నిర్దేశిస్తే...  న్యూజిలాండ్ లోని. మిడిలార్డర్  ఆటగాడు రాస్ టేలర్  చేసిన సెంచరీ  మాత్రం జట్టును  విజయతీరాలకు చేర్చింది . భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయినా శ్రేయస్ అయ్యర్ 107 బంతుల్లో  103 పరుగులు చేస్తే... న్యూజిలాండ్ మిడిలార్డర్ ప్లేయర్ రాస్ టేలర్  84 బంతల్లో  109 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితే ఓకే వన్డే మ్యాచ్ లో ఇద్దరు మిడిలార్డర్ బ్యాట్స్మెన్ లు సెంచరీలు చేయడం రికార్డు అని చెప్పాలి. 

 

 

 ఇలాంటి సెంచరీ 4 సంవత్సరాల క్రితం నమోదైంది. 2017 సంవత్సరంలో భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్లో నాలుగో  స్థానంలో వచ్చిన యువరాజ్ సింగ్.. ఇయాన్ మోర్గాన్ లు సెంచరీలు బాది  రికార్డ్ సృష్టించారు. ఇక ఇప్పుడు ఇన్నాళ్ళకి  శ్రేయస్ అయ్యర్..రాస్ టేలర్ ఆ  రికార్డును బ్రేక్ చేశారు. అయితే సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో రాస్ టేలర్ ఎంతో అనుభవజ్ఞుడు అయితే...శ్రేయాస్ అయ్యర్  మాత్రం యువ క్రికెటర్. ఏదేమైనా మొదటి వన్డే మ్యాచ్లో ఆటగాళ్లు  ఆడిన తీరు సెంచరీ బాదిన తీరు మాత్రం క్రికెట్ ప్రేక్షకులకు ఎంతగానో వినోదాన్ని పంచింది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: