ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. వరుస సిరీస్ను గెలుచుకున్న దూసుకుపోతున్న న్యూజిలాండ్ పర్యటనలో భారీ షాక్ తగిలినట్లయింది. మొదట ఆదిత్య న్యూజిలాండ్ జట్టుతో టి20 సిరీస్ ఆడిన టీమిండియా అద్భుత ప్రదర్శన చేసి ఆదిత్య జట్టును స్వదేశంలోని క్లీన్ స్వీప్ చేసింది. అయితే వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి సిరీస్ గెలుచుకున్న టీమిండియాను ఆ తర్వాత పట్టువిడవకుండా మరో రెండు మ్యాచ్లలో విజయం సాధించి న్యూజిలాండ్ జట్టు క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఆ తర్వాత జరిగిన వన్డే మ్యాచ్లో మాత్రం పేలవ  ప్రదర్శన చేసి.. ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు సిరీస్ని కట్టబెట్టింది. అయితే టీమిండియాను వన్డే సిరీస్లో క్లీన్స్వీప్ చేసి పరువు నిలబెట్టుకోవాలని న్యూజిలాండ్ భావిస్తుండగా 
...ఒక్క మ్యాచ్ అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఇండియా భావిస్తున్నది. 

 


 అయితే సరిగ్గా ఏడాది క్రితం భారత జట్టు న్యూజిలాండ్ పర్యటించింది. అప్పుడు టి20 సిరీస్ కోల్పోయిన టీమిండియా వన్డే సిరీస్ను గెలుచుకున్నది. కానీ ఈ సారి మాత్రం అది రివర్స్ గా మారింది టి-20లో జయభేరి మోగించి న్యూజిలాండ్ ను క్లీన్స్వీప్ చేసిన టీమిండియా వన్డే సిరీస్ ను చేజార్చుకుంది. అయితే పొట్టి ఫార్మాట్లోనూ ప్రత్యర్థిని క్లీన్ స్వీప్ చేసిన కోహ్లీ సేన ప్రస్తుతం వన్డేలో మాత్రం అలాంటి పరాభవం తమకు ఎదురు కాకుండా చూసుకోవాల్సిన స్థితిలో నిలిచింది. మూడో వన్డే మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని టీమిండియా.. టి20లో క్లీన్ స్వీప్ చేసిన ప్రతీకారం తీర్చుకుని వన్డేలో క్లీన్స్వీప్ చేయాలని న్యూజిలాండ్ జట్ల సన్నద్ధమయ్యయి . 

 

 మౌంట్ మంగన్ వేదికగా... జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్లో మరోసారి టీమిండియా క్లిష్ట పరిస్థితుల్లో పడిపోయింది. టాస్ గెలిచిన  కివీస్ జట్టు కోహ్లీసేన బ్యాటింగ్ కు ఆహ్వానించింది. కాగా 32 పరుగులకే 2కీలకమైన వికెట్లను కోల్పోయింది టీమ్ ఇండియా . ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మరోసారి నిరాశ పరిచి  ఒక్క పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ అదరగొడతడు  అనుకుంటే 12 బంతుల్లో 9 పరుగులు చేసి మరోసారి విఫలమయ్యాడు. తొలి వన్డేలో 51 పరుగులు చేసి రాణించిన కోహ్లీ.. రెండో వన్డేలో 15 పరుగులకే వెనుదిరిగాడు విషయం తెలిసిందే. టీమిండియా కీలక వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లోనే ముందుకు సాగుతోంది. ప్రస్తుతం మిడిలార్డర్ బ్యాట్స్మన్ పైనే  ఎక్కువ ఆశలు పెట్టుకుంది. మరి మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందో ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: