టీమిండియా ఎన్నో ఏళ్ల నుంచి మిడిలార్డర్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీం ఇండియా మిడిలార్డర్ పై ఎన్నో ఆశలు కల్పిస్తూ తెర మీదికి వచ్చాడు రిషబ్ పంత్. 5వ స్థానంలో బ్యాటింగ్  చేస్తూ వికెట్ కీపర్గా చేస్తుండడంతో ధోని వారసుడు వచ్చాడు అంటూ  క్రికెట్ ప్రేక్షకులు అందరూ భావించారు. ఈ క్రమంలోనే అటు టీమిండియా యాజమాన్యం కూడా ఏ ఆటగానికి ఇవ్వనని అవకాశాలను రిషబ్ పంత్  కు ఇస్తూ  వచ్చింది. అయినప్పటికీ పంత్  మాత్రం తనను తాను నిరూపించుకోలేక  పోయాడు. మంచి అవకాశాలు అన్నింటిని పేలవ ప్రదర్శన చేస్తూ చేజార్చుకున్నాడు  . అయినప్పటికీ రిషబ్ పంత్ కి అవకాశాలు మాత్రం తగ్గలేదు. 

 

 

 అయితే గతేడాది వరకు భారత క్రికెట్ లో అన్ని ఫార్మాట్లకు ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్ గా కొనసాగిన రిషబ్ పంత్.  గత కొంతకాలంగా మాత్రం రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్తో పంతు గాయం... అతని రిజర్వు స్థానం లోనికి నెట్టేసింది. పంత్ స్థానంలో వికెట్ కీపర్ గా మారిన కె.ఎల్.రాహుల్ సక్సెస్ఫుల్గా కీపింగ్  నిర్వహిస్తున్నారు... ఏ స్థానంలో దిగిన మంచి బ్యాటింగ్ చేస్తుండడంతో రిషబ్ పంత్ కు ఎక్కడ అవకాశం దొరకలేదు. అయితే న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్కు కె.ఎల్.రాహుల్ లేకపోవడంతో పంత్ కి  అవకాశం రావచ్చు అని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ కూడా గ్యారెంటీ లేనట్లు తెలుస్తోంది. 

 

 

 న్యూజిలాండ్తో జరిగే పోయే టెస్ట్ సిరీస్లో భారత జట్టు లో వృద్ధిమాన్ సాహా కూడా ఉండడంతో తుది జట్టులో మరోసారి పంత్ లేనట్లే అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అత్యుత్తమ కీపింగ్ స్కిల్స్ ఉన్న వృద్ధిమాన్ సాహా వైపు మేనేజ్మెంట్ మొగ్గు చూపితే మాత్రమే పంత్ రిజర్వ్ బెంచ్ కే  పరిమితం కావాల్సి వస్తుంది. దీనిపై టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానే మాట్లాడుతూ... ఏది జరిగినా పాజిటివ్  గా ఉంటూ  మన స్కిల్  మెరుగుపరచుకోవడం మనముందున్న కర్తవ్యం అని గుర్తిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటూ తెలిపాడు. ఇకపోతే టీమిండియాలో రిషబ్ పంత్ రోల్  ఏమిటో తెలుసుకోవాలంటూ నెటిజన్లు  కూడా ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: