క్రికెట్ లో మంచి స్థాయిలో ఉన్నారంటే... డబ్బులు  కూడా భారీగానే వస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కు అంతలా క్రేజ్ ఉంటుంది మరి. అదే బాగా క్లిక్ అయిన ఆటగాడికి అయితే మరింత గిరాకీ ఉంటుంది. మరి అంత బాగా ఫేమస్ అయిన ఆటగాడు ఒక దొంగ గా మారాడు అంటే నమ్ముతారా. అదేంటండి  క్రికెట్ ఆడితే కోట్లకు కోట్లు వస్తాయి ఇంకా దొంగగా ఎందుకు  అవుతాడు అంటారా.. ఇక్కడ ఒక బ్యాట్మెన్ మాత్రం దొంగ గా మారాడు. వ్యసనాలకు అలవాటు పడి దొంగగా మారి  పోలీసులకు చిక్కాడు . వివరాల్లోకి వెళితే... ఆస్ట్రేలియాకు చెందిన ల్యూక్ ఫోమర్స్  బ్యాక్ ఒకప్పుడు టి 20 క్రికెట్ లో విధ్వంసకర బ్యాట్ మెన్ గా  పేరుతెచ్చుకున్నాడు. బిగ్ బాష్  లీగ్ నుంచి ఐపీఎల్ వరకు ప్రపంచంలో పేరుమోసిన టీ20 లలో ఆడి తన సత్తా చాటాడు. ఏకంగా ఐపీఎల్లో లక్షల డాలర్ల ధర కూడా పలికారు ఈ డాషింగ్ టీ20 విధ్వంసకర బ్యాట్ మెన్. కానీ ఇప్పుడు మాత్రం దొంగ గా మారిపోయాడు. 

 

 

 ఒకప్పుడు టి20లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ల్యూక్ ఫోమర్స్... వ్యసనాల బారిన పడి కెరీర్ మొత్తం పాడు చేసుకున్నాడు. మొత్తంగా అప్రదిష్ట పాలయ్యాడు.కెరియర్  మొత్తం నాశనమై సర్వం  కోల్పోయి.. ప్రస్తుతం ఓ కారులో నివాసం ఉంటున్నాడు అంటే ఎంత దీన స్థితి లో ఉన్నాడో  అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే వ్యసనాలకు బానిస గా మారిపోయాడు పొమర్స్  బ్యాక్... అంతేకాదు ఓ సైకిల్ని దొంగతనం కూడా చేశాడు. దీంతో సైకిల్ ని దొంగతనం చేసిన అభియోగాలు ఎదుర్కొంటున్న ఈ క్రికెటర్ కథ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 

 

 

 అయితే ఈ ఆటగాడి వ్యవహారశైలి మొదటి నుంచి వివాదాస్పదం గానే సాగింది. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్న సమయంలో... అమెరికా జాతీయురాలు ని వేధించిన కేసులో.. ఢిల్లీ పోలీసులు ఫోర్మర్స్ బాక్స్ ను అరెస్ట్ చేశారు. ఇక ఈ ఘటన జరగడంతో ఆ సీజన్ నుంచి ఫోమర్స్ బ్యాక్ ను  ఐపీఎల్ యాజమాన్యం తొలగించింది. ఇక ఆ తర్వాత బిగ్ బాష్  లీగ్ లో తన సత్తా చాటుతూ రావడంతో తాను ప్రాతినిధ్యం వహించిన బ్రిస్బేన్ హిట్  జట్టు టైటిల్ నెగ్గింది. కాగా ఈ మ్యాచ్ జరిగి  ఎనిమిదేళ్లయింది. అయితే ఫోమర్స్ బ్యాక్  మారిపోయాడు అనుకున్నారు అంతా..కానీ  దొంగలుగా మారారు అని ఎవరూ ఊహించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: