భారత్ లో  క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్రికెట్ మ్యాచ్ వస్తుంది అంటే చాలు టీవీలకు అతుక్కుపోయి మరి చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇక క్రికెట్ మ్యాచ్ చూడడమే కాదు కాస్తంత సమయం దొరికినా మైదానంలోకి చేరుకుని క్రికెట్ ఆడటానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇలా గల్లీ క్రికెట్ ఆడే వాళ్ళు ఎంతోమంది. ముఖ్యంగా సండే వచ్చిందంటే చాలు మైదానం లో కుప్పలు తెప్పలు గా కనిపిస్తూ ఉంటారు క్రికెట్ ఆడే జనాలు. చిన్నవారి నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ క్రికెట్ ఆడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అంతలా క్రికెట్ భారత ప్రేక్షకులను ప్రభావితం చేస్తూ ఉంటుంది. 

 


 అయితే టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు భారత బ్యాట్స్మెన్ ఒక అద్భుతమైన షాట్ ఆడినప్పుడు.. సోఫా లో కూర్చుని ఎగిరి గంతులేస్తూ ఉంటారు. అయితే కేవలం టీవీలోనే కాదు... బయట కూడా గల్లీ క్రికెట్ లో కొంతమంది ఆడే  షాట్లకు నూరేళ్ళ పెట్టాల్సింది. జాతీయ క్రికెట్ లో కూడా అలాంటి షాట్లు ఎప్పుడు చూడలేము అనిపిస్తుంది. అంత అద్భుతంగా అంతా విచిత్రంగా షాట్లు కొడుతూ సిక్సర్లు బాదుతూ  ఉంటారు. ఇక తాజాగా ఇక్కడ ఒక బ్యాట్స్మెన్ ఆడిన షార్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఈ మ్యాచ్ ఎక్కడ జరిగిందో తెలియదు కానీ... టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ లో ఒక ప్లేయర్ కొట్టిన షార్ట్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 

 

 ఇలాంటి టెక్నిక్స్ షాట్ ను  జాతీయ క్రికెట్ లో కూడా ఇప్పటివరకు ఏ ప్రేక్షకుడు వీక్షించి ఉండడు. క్రికెట్ ప్రపంచానికి కొత్త షాట్ ని  పరిచయం చేశాడు ఇక్కడ ఒక వ్యక్తి. యార్కర్  వచ్చిన బాల్ ను  కూడా తనదైన టెక్నిక్తో సిక్సర్ బాదేశాడు. దీంతో ఇది చూసిన నెటిజన్లు అందరూ ఈ యువకుడు షాప్ కి ఫిదా అయిపోతున్నారు. ఇక ఈ షాట్  కి ఏ పేరు పెట్టాలో కూడా తెలియక... నెటిజనులు ఈ షాట్ కి కొత్త  ఎన్ని పేర్లు కూడా పెట్టేస్తున్నారు. కొంతమంది ఇది రివర్స్  హెలికాప్టర్ షాట్ అని అంటుంటే.. ఇంకొంతమంది స్ట్రెయిట్ డ్రైవ్ షాట్  అభివర్ణిస్తున్నారు. ఇంకొంతమంది ధోనీ షాట్ ను చూస్తే మాత్రం వచ్చే ఐపీఎల్ లో ఇలాంటి షాట్ కొట్టేస్తాడు  అంటూ కామెంట్లు  పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: