కొన్ని కొన్ని ప్రేమ కథలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. అందులో ప్రత్యేకంగా చెప్పుకునేది మురళి విజయ్ నికిత కార్తిక్ ప్రేమ కథ. ఈ వివాహం ఈ ప్రేమ ఇప్పటికి చాలా మందికి ఆశ్చర్యమే. అప్పటికే దినేష్ కార్తిక్ ని వివాహం చేసుకున్న నికిత ఆ తర్వాత మురళి విజయ్ తో ప్రేమలో పడటం పై ఎన్నో కథనాలు ఉన్నాయి. జాతీయ మీడియా చెప్పే దాని ప్రకారం చూస్తే వీరు ఇద్దరూ ముందే ప్రేమించుకున్నారు  అని. నికిత కార్తిక్ కి దినేష్ కార్తిక్ తో గొడవలు కావడం తో ఆమె అతనికి దూరం అయిందని ఆ తర్వాత మురళి విజయ కి దగ్గర అయింది అని చెప్తారు. 

 

కాని దినేష్ కార్తిక్ తో ఉన్న సమయంలో ఆమె అతన్ని ప్రేమించింది అని అతన్ని కావాలి అనుకుంది అనేది చాలా మంది చెప్పే మాట. వీరి వివాహం అప్పట్లో అత్యంత వివాదాస్పదం. వీరి ముగ్గురి మధ్య గొడవలు కూడా జరిగాయని పెద్దలు కొందరు రాజీ చేయడానికి ప్రయత్నాలు చేసారని కూడా అంటారు. ముఖ్యంగా మురళి విజయ్ ఈ విషయంలో దూకుడు గా వెళ్ళడం తో అప్పుడు చాలా మందికి ఈ పరిణామం నచ్చలేదు అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత మురళి విజయ్ దినేష్ కార్తిక్ కలిసి ఆడిన మ్యాచ్ లు కూడా చాలా తక్కువ. 

 

నికిత కార్తిక్ ని మురళి విజయ్ వివాహం చేసుకోవడం చాలా మంది ఆటగాళ్ల కు కూడా నచ్చలేదు. అయినా సరే అతను కీలక ఆటగాడు కావడం తో అతన్ని జట్టులో ఉంచారు. సీనియర్ ఆటగాడిగా ఇప్పటి కి అతను టెస్ట్ జట్టు లో ఉన్నారు. ఏది ఎలా ఉన్నా సరే అప్పటికే పెళ్లి అయిపోయిన నికితను మళ్ళీ అతను ప్రేమించడం పెళ్లి చేసుకోవడం నిజంగా సంచలనమే.

మరింత సమాచారం తెలుసుకోండి: