టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్  విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్ మెన్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ... ఎప్పుడు మైదానంలో విజయం కోసం తహ లాడుతూ ఉంటాడు. ఇక విజయం సాధించడానికి కొన్ని కొన్ని సార్లు ఆశ్చర్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు విరాట్  కోహ్లీ . మైదానం లో ఉన్నప్పుడు ఫీల్డింగ్  లో తన సత్తా చాటుతూ అగ్రెసివ్ గా  కనిపిస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ. అయితే విరాట్ కోహ్లీ మైదానంలో ఆటగాళ్ళ విషయంలో కూడా కచ్చితత్వంతో ఉంటారు అన్న విషయం తెలిసిందే. తప్పు చేసిన వారిపై అగ్రెసివ్ గా ఫైర్  అవుతూ ఉంటాడు. 

 

 

 ఇదిలా ఉంటే... అప్పుడప్పుడు ఏకంగా ప్రత్యర్థి ఆటగాళ్లపై స్లెడ్జింగ్  చేయడానికి కూడా వెనకాడడు  విరాట్ కోహ్లీ. అండర్ 19 వరల్డ్ కప్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సమయంలో కూడా కవ్వింపులకు  పాల్పడ్డాడు విరాట్  కోహ్లీ . ఈ క్రమంలోనే 2011 వన్డే ప్రపంచకప్లో విరాట్  కోహ్లీ స్లెడ్జింగ్ కి  పాల్పడడానికి ప్రయత్నించాడు అంటూ బంగ్లాదేశ్ ఆటగాడు ఇమ్రుల్ ఖైస్  తాజాగా వెల్లడించారు. మొదటి నుంచి మంచి ఫ్రెండ్స్ అయినా మేమిద్దరం మొదటిసారిగా 2011 వన్డే ప్రపంచకప్ లో  మైదానంలో ప్రత్యర్థులుగా పోటీ పడ్డామని.. ఇక ఈ మ్యాచ్లో ఏకంగా తన పై కోహ్లీ కవ్వింపులకు  దిగడం తనను ఎంతగానో ఆశ్చర్యపరిచింది అంటూ చెప్పుకొచ్చాడు బంగ్లా ఆటగాడు ఇమ్రుల్ . 

 

 

 ఈ విషయంలో తాను ఏమీ బదులు ఇవ్వకుండా ఈ విషయాన్ని తమీమ్  ఇక్బాల్ కి చెప్పానని... దీంతో తమిమ్ కవ్విలకు  కి పాల్పడడం మొదలుపెట్టాడు అంటూ తెలిపాడు. అయితే కవ్వింపులు దిగడంలో తమిమ్  ఎంతో ఎక్స్పెక్ట్. అలాగే మైదానంలో దూకుడుగా ఉంటాడు అని...కోహ్లీ పై  ఎదురు దాడికి దిగటంతో  ఎప్పుడు తనపై కోహ్లీ కవ్వింపులకు దిగలేదు అంటూ చెప్పుకొచ్చాడు. కాగా విరాట్ కోహ్లీ జట్టులో ఉన్న సమయంలోనే భారత్ తో ఇమ్రుల్  మూడు టెస్టులు, ఐదు వన్డేలు ఒక ట్వంటీ20 మ్యాచ్ లు  ఆడాడు. కానీ 2011 వన్డే ప్రపంచకప్ తర్వాత కోహ్లీ ఇమ్రుల్  పై కవ్వింపులు దిగిన వాతావరణం మాత్రం ఎక్కడా కనిపించలేదు. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ అయిన రూబెల్ హుస్సేన్ కోహ్లి మధ్య సుదీర్ఘ కాలంపాటు పోరు  జరిగింది. ఒకరిపై ఒకరు కవ్వింపులు దిగుతూనే ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: