ప్రస్తుతం కరోనా  వైరస్ ప్రభావం దృశ్య ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రికెట్ మ్యాచ్లు జరగడం లేదు అన్న విషయం తెలిసిందే. దీంతో క్రికెట్ ఆటగాళ్లకు కోచ్ లకి  ఎలాంటి పని లేకపోవడంతో ప్రస్తుతం ఇంటికే పరిమితమై హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఎప్పుడు విదేశాల్లో పర్యటిస్తూ వరుసగా మ్యాచ్లు ఆడే ఆటగాళ్లందరూ ప్రస్తుతం కుటుంబంతో గడుపుతున్నారు. ఇక అంతే కాకుండా సోషల్ మీడియా వేదికగా తమ అనుభవాలను నెటిజన్లలో పంచుకుంటూ నెటిజన్లను  అలరిస్తున్నారు క్రికెట్ ఆట గాళ్లు . ఇప్పటికే ఎంతో మంది ఆటగాళ్లు క్రికెట్లో తమ అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న విషయం తెలిసిందే. 

 

 అయితే తాజాగా క్రీడా  వ్యాఖ్యాత నిఖిల్ నాజ్ తో  ఇంస్టాగ్రామ్ లైవ్ ఛాట్ లో  పాకిస్తాన్ ఆటగాడైనా సక్లెయిన్ ముస్తాక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ గురించి... తనకు ఎదురైన అనుభవాలను చెప్పుకొచ్చాడు . విరాట్ కోహ్లీ అవుట్ చేయాలంటే బౌలర్  కి సరైన నిబద్ధతతో పాటు ఎంతో ప్రణాళిక ఉండాలి అంటూ చెప్పుకొచ్చాడు.గత  ఏడాది వన్డే ప్రపంచకప్ జరిగిన సమయంలో ఇంగ్లాండ్ జట్టుకు స్పిన్  కోచ్గా వ్యవహరించిన అతను... కోహ్లీ ని ఔట్  చేయడంలో మోయిన్ అలీ,  ఆదిల్ రషీద్ కు మంచి సూచనలు ఇచ్చి విజయం సాధించాడు. ఆ ఇద్దరు బౌలర్లతో... విరాట్ కోహ్లీని  అవుట్ చేయడం అనేది టీమిండియా మొత్తం వికెట్లు తీసిన దానితో సమానం అంటూ చెప్పేవాడిని అంటూ చెప్పుకొచ్చారు సక్లెయిన్ . 

 


 జట్టులోని 11మంది అతడిలోని ఆడుతున్నట్టుగా విరాట్ కోహ్లీ ఉంటాడని... అతడిని ఎప్పుడూ అలాగే చూడాలి అంటూ బౌలర్లకు  సలహాలు ఇచ్చే వాడిని అంటూ తెలిపారు. బౌలర్లకు ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడితో ఆడుతున్నానని ఎలాంటి బౌలింగ్ లో అయిన అలవోకగా ఎదుర్కోగలడు  అనే విషయాన్ని గుర్తుంచు కోవాలి అని సూచనలు చేసే వాడిని అంటూ చెప్పుకొచ్చారు. అయితే కోహ్లీ ప్రపంచంలోనే నెంబర్వన్ బ్యాట్స్మన్ అయినప్పటికీ...  ప్రణాళిక, పట్టుదల,  నమ్మకం నిబద్ధతతో బంతులు  వేస్తే విరాట్ కోహ్లీ కంటే ఎక్కడ తక్కువ కాదు అంటూ బౌలర్లకు సూచించే వాడిని అంటూ చెప్పుకొచ్చాడు సక్లెయిన్ . అత్యుత్తమ  బ్యాట్స్మెన్గా అతనికి ఒక అహం  ఉంటుందని... అలాంటప్పుడే ఒక డాట్ బాల్ వేసి అతని అహం దెబ్బ తీసి ఆ తర్వాత ప్రణాళికాబద్ధంగా బంతులు వేసి  వికెట్ తీయాలి అని బౌలర్లకు సూచనలు ఇచ్చే  వాడిని  అంటూ చెప్పుకొచ్చాడు సక్లెయిన్.

మరింత సమాచారం తెలుసుకోండి: