స్పాట్ ఫిక్సింగ్ కేసులో  టీమిండియా బౌలర్ శ్రీశాంత్ కి బీసిసిఐ ఏడేళ్ల నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇక త్వరలో  శ్రీశాంత్ కి బీసీసీఐ  విధించిన నిషేధం ముగుస్తుండటంతో... రంజీల్లో కి శ్రీశాంత్ ను  తీసుకునేందుకు ఓ జుట్టు ముందుకు వచ్చింది. అయితే మళ్లీ క్రికెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు శ్రీశాంత్  2023లో ప్రపంచకప్లో ఆడటమే తన లక్ష్యం అంటూ స్పష్టం చేశాడు. ప్రస్తుతం వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ రంజీల్లో  తన సత్తా చాటి టీమిండియాను ఎంపిక అవుతానని ధీమా వ్యక్తం చేశాడు శ్రీశాంత్. అయితే శ్రీశాంత్ ఆటను చూసేందుకు అతని అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. 

 

 అయితే ఒకప్పుడు స్టార్ ప్లేయర్ గా ఎంతో క్రేజ్ సంపాదించిన శ్రీశాంత్ ఆ తర్వాత స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిషేధానికి గురయ్యారు. ఇక తన నిషేధాన్ని ఎత్తివేయాలని శ్రీశాంత్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవన్నీ వృధా గానే మిగిలిపోయాయి. ఇక శ్రీశాంత్ కు  బిసిసిఐ విధించిన నిషేధం ఈ ఏడాది సెప్టెంబర్ తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో నిషేదం  ముగియగానే కేరళ తరఫున రంజీ లు ఆడనిస్తామని అక్కడి అసోసియేషన్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అది కూడా శ్రీశాంత్ ఫిట్నెస్ పరీక్షలో నెగ్గితేనే  ఈ అవకాశాన్ని ఇస్తామంటూ కేరళ జట్టు కోచ్ తెలిపారు. 

 


 అయితే నిషేధం తర్వాత తనకు అవకాశం ఇస్తున్న కేరళ జట్టుకు శ్రీశాంత్ శుభాకాంక్షలు తెలిపారు. తానేంటో నిరూపించుకుంటామని తనలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉంది  రుజువు చేసుకుంటానంటూ తెలిపాయి. అయితే 2023 ప్రపంచకప్లో ఆడడమే తన లక్ష్యం అంటూ చెప్పుకొచ్చాడు శ్రీశాంత్ . అయితే 2023 ప్రపంచ కప్ లో  స్థానం సంపాదిస్తా అని విశ్వాసంతోనే ఉన్నానని... వాస్తవానికి ప్రతి అథ్లెట్ కి  కూడా అలానే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శ్రీశాంత్ వయసు 37 ఏళ్ళు.  అయితే ఇప్పటికే భారత్ తరఫున 27 టెస్ట్ ల్లో  87 వికెట్లు పడగొట్టాడు శ్రీశాంత్. 53 వన్డేల్లో 75వికెట్లు, 10 టి-20లో ఏడు వికెట్లు తీసుకున్నాడు. ధోని  సారథ్యంలో టీమిండియా సాధించిన 2 ప్రపంచకప్ జట్టుల్లో కూడా శ్రీశాంత్  కూడా ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: