ప్రపంచ దిగ్గజ ఆటగాళ్లలో ఒకరు... భారత జట్టుకు ఎన్నో ఏళ్లపాటు సేవలందించిన గొప్ప ఆటగాడు.. కెప్టెన్సీ తో ఎన్నో విజయాలను సైతం అందించిన దిగ్గజ సారథి.. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న గొప్ప ఆటగాడు గంగూలీ. సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ కు వన్నె తెచ్చిన ఆటగాళ్లలో ఒకడు. ఒక సగటు ఆటగాడిగా ఒక జుట్టు సారధిగా  సౌరవ్ గంగూలి భారత క్రికెట్లో ప్రస్థానం ఎంతో అద్వితీయం అనే చెప్పాలి. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు సౌరవ్ గంగూలీ. అయితే ఇలాంటి దిగ్గజ ఆటగాడైన  సౌరవ్ గంగూలీ కి ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. సరిగ్గా ఇదే రోజున... 1996 జూన్ 22న టెస్టుల్లో అరంగేట్రం చేశారు సౌరవ్ గంగూలీ. 

 


 అంతేకాదు అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్ లలోనే సెంచరీ చేసి అదరగొట్టాడు. ఇంగ్లండ్ వేదికగా లార్డ్స్ మైదానంలో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ లలో అదరగొట్టాడు.  అతను ఏకంగా 131 పరుగులు సాధించిన భారత ప్రేక్షకులందరిని  తనవైపు ఆకర్షించారు. ఇక అటు భారత బౌలర్ ప్రసాద్ కూడా చెలరేగి బౌలింగ్ చేయడంతో 344 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అయ్యింది. ఇక భారత్ కూడా ఆదిలోనే ఒక వికెట్  కోల్పోవడంతో భారత ప్రేక్షకులు  కాస్త నిరాశ చెందారు  తర్వాత మూడో స్థానంలో వచ్చిన గంగూలీ 131 పరుగులు చేసాడు... ఇందులో ఏకంగా 20 బౌండరీలు కూడా ఉన్నాయి. 

 


 అంతేకాదు టీమిండియా మరో దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ కి  కూడా ఇదే మొదటి టెస్టు మ్యాచ్ కావడం గమనార్హం. అయితే 95 పరుగుల వద్ద వికెట్ కోల్పోయిన ద్రవిడ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. మొత్తంమీద భారత్ టెస్ట్ మ్యాచ్లో 429 పరుగులు చేసి 85 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇలా భారత దిగ్గజ ఆటగాళ్లలో  ఒకరైన సౌరవ్ గంగూలి తన మొదటి టెస్టు మ్యాచ్ లోనే అద్భుతంగా రాణించి భారత క్రికెట్ ప్రేక్షకులందరినీ ఆకర్షించాడు. ఇక ఆ తర్వాత సౌరవ్ గంగూలీ క్రికెట్ కెరియర్ ఎంత విజయవంతంగా సాగిపోయిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం బిసిసిఐ అధ్యక్ష పదవినీ  ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు సౌరవ్ గంగూలీ.

మరింత సమాచారం తెలుసుకోండి: