ప్రస్తుతం నెటిజన్లను అలరించడానికి ఆన్లైన్ లో  ఎప్పుడు సరికొత్త యాప్స్  వస్తునే ఉంటాయి అన్న  విషయం తెలిసిందే. ఇక కొన్ని ఆప్స్ ఆన్లైన్లో వచ్చి తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులర్ అయిపోతున్నాయి. ఇలా ప్రస్తుతం నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్న యాప్ జండర్ స్వాప్ ఫేస్ యాప్. ఈ యాప్ ద్వారా మగవారు ఆడవారి గా ఆడవారు మగవారి గా మారితే ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు. ప్రస్తుతం దీనిని నెటిజన్లు అందరూ అతి ఎక్కువగా వినియోగిస్తున్నారు. తాజాగా టీమిండియా క్రికెటర్లు కూడా ఈ యాప్ ను వినియోగించి కొన్ని  ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుని  నెట్టింట్లో అభిమానులను అలరిస్తున్నారు. 

 

 ఇప్పటికే యజ్వేంద్ర చాహల్ యువరాజ్ సింగ్ తమ  సహచర క్రికెటర్ల జెండర్ స్వాప్  చేసిన  ఫోటోలు ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఇదే సమయంలో ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఇందులో మీరు గర్ల్ ఫ్రెండ్ గా ఎవరిని ఎంచుకుంటారు అంటూ ఒక ప్రశ్న వేశారు. దీంతో అటు  నెటిజనులు ఇటు  సహజ క్రికెటర్లు కూడా ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు, అయితే యువరాజ్ ప్రస్తుత టీమిండియా క్రికెటర్ల  జెండర్ స్వాప్  ఫోటోలను పోస్ట్ చేస్తే.. టీమిండియా వెటరన్  స్పిన్నర్ హర్భజన్ సింగ్ గతంలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్ల జెండర్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు.

 


 ఇందులో ఉన్న వారిలో ఎవరితో డేట్ కి వెళ్తారు అంటూ ఒక సరదా ప్రశ్న కూడా విసిరాడు హర్భజన్  సింగ్ . ఇలా జెండర్ స్వాప్  చేసిన వారిలో సచిన్ టెండూల్కర్ సౌరవ్ గంగూలీ జహీర్ఖాన్ వీరేంద్ర సెహ్వాగ్ హర్భజన్ సింగ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ పోస్ట్ పై బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఫన్నీ కామెంట్ చేశాడు  మధ్యలో కళ్ళద్దాలతో  ఉన్న అమ్మాయి తో డేట్ కి వెళ్తాను అంటూ సరదాగా కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Who do u wanna go on date😜😛 as @yuvisofficial asked yesterday

A post shared by Harbhajan Turbanator Singh (@harbhajan3) on

మరింత సమాచారం తెలుసుకోండి: