ఆయమ చెక్ పెట్టాడంటే ఎదుటివాడు ఎంతటివాడైనా నిష్క్రమించాల్సిందే. ఆయన ఎత్తు వేసాడంటే ఆ ఎత్తుకు చిత్తిపోవాల్సిందే. ఆయన తిరుగులేని ప్రపంచ విజేత. క్రికెట్ అభిమానులకు సచిన టెండూల్కర్ ఎలానో, అలాగే చెస్ అభిమానులకు దేవుడు విశ్వనాథ్ ఆనంద్ అలాగ. ప్రత్యర్థిని సైతం నివ్వర పెరిచేలా ఆడటం నిజంగా అమోఘం, అత్యద్భుతం. ఐదుసార్లు ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ గెలుచుకున్న విశ్వనాథన్‌ ఆనంద్‌ త్వరలో ప్రతిష్ఠాత్మక హృదయనాథ్‌ పురస్కారం అందుకోనున్నారు.

 

దేశంలో వివిధ రంగాల్లో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన, విజయవంతమైన వ్యక్తులకు దీనిని అందజేస్తారు. పురస్కారం కింద రూ.2 లక్షల నగదు, జ్ఞాపిక ప్రదానం చేస్తారు. ఏప్రిల్‌ 12న జరిగే కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు చేతుల మీదుగా అవార్డుప్రదానం జరుగుతుంది. పలువురు చెస్‌ క్రీడాకారులను కూడా ఈ సందర్భంగా సన్మానించనున్నారు. 1969 డిసెంబర్‌ 11న జన్మించిన ఆనంద్‌ 1988లో భారత తొలి గ్రాండ్‌మాస్టర్‌ అయ్యారు. 2000-2002 వరకు ఫిడే ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ గెలుచుకుని, 2007లో ప్రపంచ ఛాంపియన్‌గా ఆవిర్భవించాడు.

 

 

గతమో ఈ పురస్కారాన్ని పొందిన వారిలో లతా మంగేష్కర్‌, బాబా సాహెబ్‌ పురందరె, ఆశా భోంస్లే, అమితాబ్‌ బచ్చన్‌, హరిప్రసాద్‌ చౌరాసియా, ఏఆర్‌ రెహమాన్‌ వంటి ప్రముఖులు ఉన్నారు. కార్యక్రమానికి మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి వినోద్‌ తవడె, పండిట్‌ హృదయనాథ్‌ మంగేష్కర్‌, బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ హాజరవుతారు. ప్రపంచ చెస్ చరిత్రలో ఒక కలికితురాయి అయిన విశ్వనాథ్ ఆనంద్ను ఈ అవార్డ్ ప్రసాదించడం పట్ల చెస్ అభిమానులు, భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: