టీమిండియా కెప్టెన్ తన లవర్ అనుష్క శర్మతో కలిసి ఓ యాడ్ లో నటించాడు. రీసెంట్ గా ఈ యాడ్ కి చెందిన ఫొటోలు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ డైనమిక్ బ్యాట్స్ మెన్ ఓ క్లాత్ మర్చంట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ఇక వచ్చే రెండు మూడు నెలలు పండుగల హడావుడే కదా. 


దీంతో ఖాతాదారులను ఆకట్టుకునేందుకు వస్త్రదుకాణం వారు ఫొటో షూట్ నిర్వహించారు. ఈ యాడ్ షూటింగ్ లో కోహ్లీ అనుష్క కలిసి నటించారు. సోషల్ మీడియాకి ఎక్కిన ఈ ఫొటోలు కాస్తా నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో కామెంట్లు మీద కామెంట్లు పెట్టేస్తున్నారు. 


సంప్రదాయ దుస్తుల్లో కోహ్లీ , అనుష్క సూపర్బ్ అని కొందరు అంటున్నారు. మరికొందరు  ఇదే కామెంట్ పెడుతూ మీ పెళ్ళి ఎప్పుడు అంటూ అడిగేస్తున్నారు. అలాగే బ్యూటిఫుల్ కపుల్ అని, జంట బాగుందని తెగ మెచ్చుకుంటున్నారు. ఇద్దరు కలిపి నటించడం ఇదే మొదటిసారి కాదు. 2013లోనే ఓ షాంపు యాడ్ కోసం కలిసి నటించారు. అప్పుడే ఇద్దరి మధ్య ఎఫైర్ మొదలైందని టాక్. ఇక అప్పటి నుంచి విరాట్ మ్యాచ్ లకి అనుష్క కూడా హజరవుతూ వస్తోంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: