టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అప్పట్లో స్వచ్చ భారత్ లో పాల్గొన్న ఫోటోని ట్విట్టర్ లో రీసెంట్ గా పెట్టిన ఆస్ట్రేలియా జర్నలిస్టు ఒకరు పోస్ట్ చేసి కోహ్లీ ని రోడ్లు ఊడ్చుకునే వాడు అంటూ పేర్కొన్న సంగతి తెలిసిందే.


ఈ విషయం ఇప్పుడు దుమారం రేపుతోంది, లాహోర్ లో పాకిస్తాన్ వర్సెస్ వరల్డ్ ఎలెవన్ క్రికెట్ మ్యాచ్ లు మొదలు అవుతున్న నేపధ్యం లో కోహ్లీ అక్కడ రోడ్లు ఊడుస్తున్నాడు అంటూ ఆమె సంచలన పోస్ట్ పెట్టింది. దీనిమీద కోహ్లీ ఫాన్స్ తీవ్రంగా స్పందించారు. ఆ జర్నలిస్ట్ మీదా ఆస్ట్రేలియా మీడియా మీదా తిట్ల దండకం మొదలు పెట్టారు వారు.


ఆ ఆస్ట్రేలియా జర్నలిస్ట్ డెన్నిస్ ఫ్రీడ్ మెన్ మీద టీం ఇండియా మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ కోప్పడ్డాడు .. కోహ్లీ అభిమానులు ఆ జర్నలిస్ట్ ని విమర్శించడం సరైన చర్య అన్నాడు బజ్జీ. అటువంటి కామెంట్ చేసినందుకు ఆ జ‌ర్న‌లిస్టు సిగ్గుప‌డాల‌ని వ్యాఖ్యానించాడు.


ఆ జ‌ర్న‌లిస్టు త‌న గౌర‌వాన్ని కాపాడుకోవాల‌ని, ఇటువంటి వ్యాఖ్య‌లు చేసి ఒక‌రిని కించ‌ప‌ర్చాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని హ‌ర్భ‌జ‌న్ సింగ్ ప్ర‌శ్నించాడు. దేశం ఏదైనా అందరం మనుషులం అనే విషయం గుర్తు పెట్టుకోవాలని కోరాడు బజ్జీ. కోహ్లీ ఇలాంటి కామెంట్ లకి స్పందించాల్సిన అవసరం కూడా లేదు అన్నాడు హర్భజన్ సింగ్. ఏనుగు రోడ్డు మీద వెళుతూ ఉంటె కుక్కలు దాన్ని చూసి మొరుగుతాయి అని బజ్జీ అన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: