తానెప్పుడూ క్రికెట్ లేని జీవితాన్ని ఊహించుక్లేదని.. క్రికెట్ తనకు ఆక్సిజన్ లాంటిదని అంటున్నాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్. ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ బ్రెట్ లీ చేసిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేశాడు సచిన్ టెండుల్కర్. క్రికెట్ లేని జీవితాన్ని తాను అసలు ఊహించుకోలేనని అన్నారు. ఇక 16 నుండి 19 ఏళ్ల వయసులో సంతోష జీవితం కోల్పోయా అని కొందరంటారని. 


కాని 16 ఏళ్ల వయసులోనే దేశం కోసం ఆడే అవకాశం అందుకోవడం తన అదృష్టమని అన్నారు. అలా ఎంతమందికి అవకాశం వస్తుంది.. అది నాకు దక్కినందుకు చాలా సంతోషమని అన్నారు సచిన్. స్టేడియం లో క్రికెట్ ఆడడాన్ని అన్నివిధాలుగా సంతోషిస్తా అని చెప్పొచ్చిన సచిన్ తన జీవితానికి సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చింది క్రికెట్ అని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: