ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఎంతో ప్రతిభకలిగిన  క్రీడాకారులను చిత్తూ చేస్తూ ఫైనల్స్ కి దూసుకువెళ్ళిన సైనా నెహ్వాల్ చివరి పోరులో విజయాన్ని అందుకోలేకపోయింది..ఎంతో ఒత్తిడితో సాగే టోర్నీ ఫైనల్స్  అందరు ఎంతో ఆశక్తిగా ఎదురుచుస్తారు..భారతీయులు ప్రతీ ఒక్కరు సైనా గెలుపుకోసం ఆరాటపడ్డారు..సైనా ఓడినా తానూ గెలవడానికి పడిన తపన..పట్టుదల ఆ కసి చుసిన భారతీయ అభిమానుల మనసులు మాత్రం గెలుచుకుంది..  

 Image result for indonesia masters 2018 badminton

శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్‌ సైనా 21–19, 21–19తో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ ఇంతనోన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌)పై 48 నిమిషాల్లోనే విజయం సాధించింది సైనా..ఎంతో మంది టాప్ ప్లేయర్స్ ని ఓడిస్తూ ఫైనల్ కి వెళ్లిన హైదరాబాద్‌ స్టార్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌..రచనోక్ తో ముఖాముఖి పోరులో 9–5తో ఆధిక్యంలోకి వెళ్లింది.

 Image result for indonesia masters 2018 badminton

 ఫైనల్లో టాప్‌సీడ్..ప్రపంచ నం.1 క్రీడాకారిణి తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)తో అమీతుమీ తేల్చుకుంటుంది. ముఖాముఖి రికార్డులో  తై జు యింగ్‌  5–8తో ఆధిక్యంలో ఉంది...ఓడినా సైనా చక్కని ప్రతిభ కనబరిచింది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రముఖులు..ఇదిలా  ఉంటే  పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి జోడీ పోరాటం సెమీస్‌లో ముగిసింది. సెమీఫైనల్లో సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి (భారత్‌) ద్వయం 14–21, 11–21తో టాప్‌ సీడ్‌ మార్కస్‌ ఫెర్నాల్డి గిడెయోన్‌ – కెవిన్‌ సంజయ సుకముల్జో (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది.   

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: