భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలి “బీసీసీఐ” కి లేఖ రాశారు.. క్యాబ్ (బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌) లో కొత్త సంస్కరనలకి కొంత గడువు కావాలని కోరారు.. “బీసీసీఐ” లో మరింత పారదర్శకత పెంచేందుకు ఏడాది క్రితం సుప్రీంకోర్టు ప్రత్యేకంగా నియమించిన లోధా కమిటీ కొన్ని సిఫార్సుల్ని బోర్డుకి సూచించిన విషయం అందరికీ తెలిసిన విషయమే..కాగా వారిని అమలు చేయడానికి “బీసీసీఐ”  ఏ మాత్రం ఆసక్తిని కనబరచడం లేదు..

 Image result for sourav ganguly lodha recamendation

ఇదిలాఉంటే ఈ సూచనలని అమలు చేయడానికి “బీసీసీఐ”  ముందుకు రావడంలేదు దాంతో గత సంవత్సరం లోనే “బీసీసీఐ”  అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలపై సుప్రీంకోర్టు వేటు వేసింది...దాంతో ఒక్కసారిగా తమ విధానాలని మార్చుకున్నారు ఇప్పుడు బోర్డులో కొంతమేర కదలిక వచ్చింది..అయితే ఈ అమలు మాత్రంపూర్తి స్థాయిలో అవ్వడం లేదు అంటున్నారు..

 Image result for lodha committee

అన్ని రాష్ట్రాలలో ఉన్న క్రికెట్ సంఘాల అభిప్రాయాలు తెలుసుకుని అమలు చేస్తామని చెప్పిన “బీసీసీఐ” కి ఇప్పుడు మళ్ళీ ఎక్కడ కోర్టు  చివాట్లు పెడుతుందోనని బయపడిపోతున్నారు..దాంతో అన్ని రాష్ట్ర సంఘాలకి ఈ మెయిల్ ద్వారా సమాచారం పంపింది “బీసీసీఐ” అయితే క్యాబ్ సమావేశం ఇటీవల ముగిసింది దాంతో మరోమారు ఈ సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుందని లేఖలో తెలిపారు గంగూలి.


మరింత సమాచారం తెలుసుకోండి: