అండర్ -19 ప్రపంచకప్ లో భారత జట్టు విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే అయితే..ఆ గెలుపుకి గాను బీసీసీఐ ఆటగాళ్లకి నజరానాలు ప్రకటించింది..ఈ జట్టు కోచ్ అయిన భారత క్రికెట్ దిగ్గజం వాల్ ఆఫ్ క్రికెట్ కి కూడా భారీగానే నజరానా ప్రకటించింది..అయితే ఈ నజరానాల విషయంలో ద్రవిడ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు..నాకు 50 లక్షలు ,ఆటగాళ్లకి 25 లక్షలు సహాయ సిబ్బందికి 20 లక్షలు ప్రకటించారు ఈ విషయంలో అందరికీ సమాన ఫలితం ఉండాలి..అంటూ  బీసీసీఐ కి విన్నవించుకున్నాడు..ఆటగాళ్లకి ఎలాఅయితే పారితోషకం ఇచ్చారో అలాగే అందరికీ ఇవ్వండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు..

Image result for under 19 world cup 2018

అయితే బీసీసీఐ ద్రవిడ్ మాటలతో ఏకీభవించింది...జట్టులో అందరికీ సమానంగా ఇవ్వడానికి ద్రవిడ్ చేసిన సూచనలని పాటించింది...దాంతో  అందరికీ 25 లక్షల చొప్పున నజరానా అందిస్తామని ప్రకటించింది...అయితే తనకి ప్రకటించిన 50 లక్షలలో 25 లక్షలు తగ్గిన ఏమి పరవాలేదు అంటూ ద్రవిడ్ చెప్పిన మాటలు ఇప్పుడు అందరికి ద్రవిడ్ పై మరింత గౌరవాన్ని పెంచేశాయి..దీంతో జాతీయ క్రికెట్‌ అకాడమీ (బెంగళూరు)లో జట్టు సన్నాహాల్లో పాల్గొన్న సహాయ సిబ్బందికి కూడా నజరానా అందనుంది.


మొదటి నజరానా జాబితాలో ఉన్న పారస్‌ మాంబ్రే (బౌలింగ్‌ కోచ్‌), యోగేశ్‌ పార్మర్‌ (ఫిజియోథెరపిస్ట్‌), అభయ్‌ శర్మ (ఫీల్డింగ్‌ కోచ్‌), ఆనంద్‌ దతే (ట్రెయినర్‌), దేవ్‌రాజ్‌ రౌత్‌ (వీడియో అనలిస్ట్‌) ,మంగేశ్‌ గైక్వాడ్‌ (మసాజ్‌), లతో పాటు స్వదేశంలోని సన్నాహాల్లో పాలుపంచుకున్న మరో ఐదుగురు డబ్ల్యూవీ రామన్‌ (కోచ్‌), మనుజ్‌ శర్మ, సుమిత్‌ మలహపుర్కర్‌ (లాజిస్టిక్స్‌ మేనేజర్స్‌), అమోఘ్‌ పండిట్‌ (ట్రెయినర్‌), రాజేశ్‌ సావంత్‌ (దివంగత ట్రెయినర్‌)లకు  ఈ సమాన నజరానా అందనుంది.జట్టు గెలుపుకోసం ఆటగాళ్ళే కాదు తెరవెనుక కష్టపడే ప్రతీ ఒక్కరికీ సమాన వేతంనం దొరకాలని అనుకోవడం నిజంగా ఎంతో అభినందనీయం..అంటూ ద్రవిడ్ పై ట్విట్టర్ లో ప్రశంసలు కురిపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: