కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినా, 143 బంతుల్లో 112 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లుమ గా ఎంతో అద్భుతమైన ప్రదర్సన చేసినా విజయన్ని మాత్రం చేజిక్కించుకోలేక పోయాడు న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌...హోరా హరీ పోరులో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో తుది వరకు పోరాడినా ఫైనల్ గా ఓటమిని చవి చూడక తప్పలేదు కీవీస్ కి..టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ కి మొగ్గు చూపిన న్యూజిలాండ్ ఇంగ్లాండ్ స్కోర్ ని భారీగా వెళ్ళకుండా కంట్రోల్ చేసింది..అయితే

 సంబంధిత చిత్రం

బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో 234 పరుగులకే ఆలౌటైంది...కెప్టెన్‌ “ఇయాన్‌ మోర్గాన్‌ -48; 3 ఫోర్లు, 1 సిక్స్‌” కొట్టి  టాప్‌ స్కోరర్‌గా నిలవగా, బెన్‌ స్టోక్స్‌ (39; 2 ఫోర్లు) కీలక పరుగులు సాధించాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 71 పరుగులు జోడించారు...బౌలర్ ఇష్‌ సోధి 3 వికెట్లు తీశాడు..

 new zealand vs england 3rd odi 2018 కోసం చిత్ర ఫలితం

ఆ తరువాత న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 230 పరుగులు చేయగలిగింది...మున్రో -49; 7 ఫోర్లు...సాన్‌ట్నర్‌-41; 3 ఫోర్లు రాణించారు. ఒక దశలో 80/1 పటిష్టంగా ఉన్న కివీస్‌...ఇంగ్లండ్‌ స్పిన్నర్లు మొయిన్‌ అలీ-3/36, ఆదిల్‌ రషీద్‌ 2/34 ధాటికి 23 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో విలియమ్సన్..సాన్‌ట్నర్‌ ఏడో వికెట్‌కు 96 పరుగులు జోడించి జట్టును గెలుపు దిశగా నడిపించారు.అయితే మ్యాచ్ మలుపు తిరగడానికి మాత్రం సాన్‌ట్నర్‌ రనౌట్‌..

 సంబంధిత చిత్రం

విలియమ్సన్‌ తొలి నాలుగు బంతుల్లో భారీ సిక్సర్‌ సహా 10 పరుగులు రాబట్టాడు...ఈ పరిస్థితిలో ఎక్కడా కూడా ఒత్తిడికి లోనవ్వకుండా  బౌలింగ్‌ చేసిన వోక్స్‌ ఆఖరి రెండు బంతులకు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఇంగ్లండ్‌ విజయాన్ని ఖాయం చేశాడు. ఐదు వన్డేల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్‌ 2–1తో ఆధిక్యంలో నిలిచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: