ఐపీఎల్ నిర్వహణ పేరుతో లక్షలాది లీటర్ల నీళ్ళు దుర్వినియోగం అవుతున్నాయి అని వెంటనే ఐపీఎల్‌ను అడ్డుకోవాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ లో ఓ పిటిషన్‌ దాఖలైంది..ఈ పిటిషన్‌ను బుధవారం విచారణకు స్వీకరించిన ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వం, బీసీసీఐలను వివరణ కోరుతూ ఇరువురికీ నోటీసులు పంపింది..

 Image result for ipl court petition ngt

అయితే జస్టిస్ జవద్ రహీం నేతృత్వంలోని ఎన్‌జీటీ ధర్మాసనం కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ, భారత క్రికెట్‌ నియంత్ర మండలి (బీసీసీఐ), ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తున్న 9 రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులిచ్చింది. రెండు వారాల్లోగా సమాధానాలు సమర్పించాలని..తదుపరి విచారణ వచ్చే నెల 28న జరుగుతుందని చెప్పింది..అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆళ్వార్‌కు చెందిన హైదర్ అలీ అనే యువకుడు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఐపీఎల్‌లో పిచ్‌లను సిద్ధం చేయడానికి లక్షలాది లీటర్ల నీరు వృథా అవుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

 Image result for ipl court petition ngt

నీటిని దుర్వినియోగం చేస్తూ ఈ టోర్నీలో భాగస్వామ్యులైన వారందరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యాపార ప్రయోజనాల కోసం నిర్వహిస్తున్న ఈ టోర్నీని వెంటనే నిలిపేయాలని ఇది ఏమాత్రం సమాజానికి ఉపయోగకరం కాదని వ్యాపారంగా ఆడే ఆటలకి నీటిని నష్టపోవడం న్యాయం కాదని పిటిషన్ లో పేర్కొన్నాడు... గత ఐపీఎల్‌లో మహారాష్ట్రాల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడటంతో కొన్ని మ్యాచ్‌ల వేదికలను తరలించిన విషయం తెలిసిందే. 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: