రెండు రోజులు వర్షం కారణంగా ఆట ఆగినప్పట్టికీ చివరి రోజు మాత్రం అత్యంత నాటకీయంగా తొలి టెస్ట్ న్యూజిలాండ్ 49 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధించింది..ఒకే ఒక్క రోజు క్రీజులో ఉండి ఉంటే  ఆట డ్రాగా ముగిసేది కానీ ఇంగ్లాండ్ ఆ అవకాశాన్ని జారవిడుచుకుంది..ఓవర్‌నైట్‌ స్కోరు 132/3తో సోమవారం రెండో ఇ న్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ 320 పరుగులకు ఆలౌ టైంది.

 

అయితే రెండు జట్లు మధ్య ఇప్పటి వరకూ జరిగిన టెస్టు చరిత్రలో కేవీస్ నెగ్గడం ఇది కేవలం 10వసారే. డే అండ్ నైట్ మ్యాచ్ లో ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఆదుకొనే ప్రయత్నం చేశాడు. కానీ 66 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అతడు అవుట్‌ కావడంతో ఇంగ్లండ్‌ పరిస్థితి తారుమారైంది.

 

ముగ్గురు కీలక బ్యాట్స్‌మెన్‌ స్టోన్‌మన్‌, స్టోక్స్‌, వోక్స్‌ల వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను వాగ్నర్‌ దెబ్బకొట్టాడు. బౌల్ట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు... కివీస్‌ జట్టు ఇన్నింగ్స్‌ 49 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచి రెండు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యతలో నిలిచింది.

 

ఇంగ్లండ్‌:      58, 320 (స్టోన్‌మన్‌ 55, స్టోక్స్‌ 66, క్రిస్‌ వోక్స్‌ 52, బౌల్ట్‌ 3/67);

న్యూజిలాండ్‌  తొలి ఇన్నింగ్స్‌ : 427/8 డిక్లేర్డ్‌.

 


మరింత సమాచారం తెలుసుకోండి: