అసలే రెండేళ్ళ నిషేధం తరువాత మళ్ళీ ఐపీఎల్ -11 సీజన్ ద్వారా మ్యాచ్ లలోకి ఎంట్రీ ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ మరో మారు పీకల్లోతు కష్టాలలోకి  వెళ్ళ బోతోందా..అంటే అవుననే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు..ఆదివారం మొహాలీలో పంజాబ్‌ కింగ్స్‌ లెవెన్‌తో జరిగిన మ్యాచ్‌లో మహీ వెన్నునొప్పి తాళలేకపోవడం..ఇన్నింగ్స్‌ మధ్యలో  ఎంతో ఇబ్బంది పది తరువాత ఫిజియోథెరపీ చేయించుకున్న ధోనీ ఆ తరువాత బంతుల్ని ఆడలేక పోవడంతో 4 పరుగుల తేడాతో చెన్నై ఓడిపోయింది

 Image result for chennai super king dhoni back pain

ధోనీ వెన్ను నొప్పితో ఎంతో ఇబ్బంది పడటంతో అభిమానులు అందరూ కంగారు పడుతున్న సమయంలో ధోనీ ఇచ్చిన క్లారిటీ కొంత ఉపసమనం ఇచ్చింది.. ‘‘అవును. వెన్నునొప్పి నన్ను బాధించింది. ఫిజియో సాయంతో కాస్త ఉపశమనం పొందాను. ఇవేవీ నాకు కొత్తేంకాదు...నొప్పిని భరిస్తూ ఆడగలను. దేవుడు నాకా శక్తి ఇచ్చాడు. పైగా తర్వాతి మ్యాచ్‌కు కొంత గ్యాప్‌ వచ్చింది కాబట్టి బహుశా పూర్తిగా కోలుకోవచ్చని ఆశిస్తున్నా’’  అని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు..

 Image result for chennai super king dhoni back pain

ఇదిలాఉంటే చెన్నై సూపర్‌ కింగ్స్‌ తన తర్వాతి మ్యాచ్‌లో శుక్రవారం ఏప్రిల్‌ 20న రాజస్తాన్‌ తో తలపడనుంది. పుణె వేదికగా ఆ మ్యాచ్‌ జరుగనుంది..అయితే సీజన్ మొదటి నుంచీ ఎదో ఒక రూపంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్న జట్టు కావేరి జలాల కారణంగా సొంత గడ్డకి దూరం కావడం , జట్టులో  కీలక ఆటగాళ్లు అయిన సురేశ్‌ రైనా, కేదార్‌ జాదవ్‌లు గాయాలతో టోర్నీకి దూరం అవ్వడం.. .మరణించడంతో సౌతాఫ్రికా బౌలర్‌ స్వదేశానికి వెళ్లిపోవడం చెన్నై సూపర్ కింగ్స్ కి కోలుకోలేని పరిణామాలు..



మరింత సమాచారం తెలుసుకోండి: