ఇండియన్ క్రికెట్ టీం కి ఎంతో మంది సారధులుగా వ్యవహరించారు..ఎంతో మంది ఎన్నో మర్చిపోలేని విజయాల్ని అందించారు కానీ ఎంఎస్‌ ధోనీ సారధ్యంలో భారత క్రికెట్‌ ఎన్నో మరిచిపోల్ని విజయాల్ని సొంతం చేసుకుని అంతేకాదు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌ గా ధోనీ ఎంతో కీర్తిని సైతం సంపాదించాడు..అతడి సారథ్యంలో భారత్‌ 2007 వరల్డ్‌ టీ20 టైటిల్‌తోపాటు 2011 వన్డే ప్రపంచకప్‌, 2013 చాంపియన్స్‌ ట్రోఫీలను కైవసం చేసుకుంది.

 Image result for sachin comments on dhoni

అయితే వాస్తవంగా 2007 తొలి టీ20 వరల్డ్‌ కప్‌లో తలపడే టీమిండియాకు ధోనీని కెప్టెన్‌గా ఎంపిక చేసినప్పుడు చాలామందికి ఆ నిర్ణయం నచ్చలేదు..అతడిపై ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారు.. అప్పుడే జట్టులోకి వచ్చి న ధోనీ సీనియర్లతో కూడిన భారత్‌ను నడపగలడా అన్న సందేహాలూ వ్యక్తంచేశారు. కానీ అప్పట్లో.. ధోనీకి పూర్తి మద్దతు ఇచ్చాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్‌.

 Image result for sachin

 సహజంగానే ప్రతిభ ఉంటే గుర్తించి ప్రోత్సాహం అందించే సచిన్ కి ధోనీ లో ప్రతిభని గుర్తించడం మొదలు పెట్టాడు..ఫీల్డింగ్‌ ఏర్పాట్లకు సంబంధించి మైదానంలో చర్చల సందర్భంగా ధోనీలో ప్రతిభను గుర్తించానని సచిన్‌ తెలిపాడు...‘స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న సమయాల్లో..ఫీల్డర్స్ ని మైదానంలో పెట్టడంపై ధోనీ తో  చర్చిస్తుండేవాడిని. అప్పుడే ధోనీలో నాయకత్వ లక్షణాలను గుర్తించానని తెలిపాడు సచిన్..అతడి ఆత్మ స్థైర్యమే..ఆటపై ఉన్న ప్రేమే అతడిని ఒక సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ఒక మంచి ఆటగాడిగా గుర్తింపు తెచ్చి పెట్టిందని అన్నాడు సచిన్..


మరింత సమాచారం తెలుసుకోండి: