ఆదివారం జరిగిన స్పెయిన్  గ్రాండ్‌ప్రి రేసులో ఎంతో చక్కని ప్రతిభ కనబరిచిన హమిల్టన్ ప్రధానమైన రేసులో తన ప్రతిభని కనబరిచి సీజన్ రెండో టైటిల్ సొంతం చేసుకున్నాడు..పోల్ పొజిషన్ తో రేసుని మొదలు పెట్టిన హమిల్టన్ ల్యాప్ చివరి వరకూ కూడా ఆధిక్యాన్ని కాపాడుకున్నాడు..ముందుగానే నిర్ణయించబడే 66 ల్యాప్‌లను గంటా 35 నిమిషాల 29.972 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు.

 Image result for hamilton pole

అయితే హామిల్టన్‌కి ఈ సీజన్ లో ఇది రెండో టైటిలే మరియు తన కెరియర్ లో 64వ విజయం గా నమోదు చేసుకున్నాడు..అయితే నాటకీయ పద్దతిలో మొదలైన ఈ రేసు లో తొలి ల్యాప్‌లోనే హాస్‌ జట్టు డ్రైవర్‌ గ్రోస్యెన్‌ మరో కారును ఢీకొట్టి వైదొలిగాడు. ఆ తర్వాత రేసు పూర్తయ్యేలోపు మరో ఐదుగురు డ్రైవర్లు తప్పుకున్నారు.

 Related image

ఇదిలాఉంటే రెండవ స్థానాన్ని మెర్సిడెస్‌ కి చెందిన  చెందిన బొటాస్‌ సాధించగా...వెర్‌స్టాపెన్‌ ,వెటెల్‌ ,రికియార్డో వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. “భారత్‌కు” చెందిన ఫోర్స్‌ ఇండియా డ్రైవర్‌ “పెరెజ్‌” తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోగా... సీజన్‌లో ఐదు రేసులు ముగిశాక హామిల్టన్‌ 95 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. తదుపరి


మరింత సమాచారం తెలుసుకోండి: