న్యూజిలాండ్ ఓపినింగ్ బ్యాట్స్ మెన్ రాబ్ నికోల్ 17 ఏళ్ల తన  అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బాయ్ చెప్పేశాడు. ఓపెనర్ గా నికోల్ దిగితే తప్పకుండా తన అత్యుత్తమ ప్రతిభని కనబరిచే వాడు..35ఏళ్ల నికోల్ కివీస్ తరఫున రెండు టెస్టులు, 22 వన్డేలు, 21 టీ20 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు..అంతేకాదు 50 ఓవర్ల ఫార్మాట్‌లో రెండు సెంచరీలు సాధించి 941 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ తరఫున అరంగేట్రంలోనే సెంచరీ బాదిన రెండో ఆటగాడు నికోల్.

 Image result for rob nicol retirement

అయితే అంతకు ముందు ఇదే రికార్డుని ఓపెనర్ మార్టిన్ గప్తిల్ నెలకొల్పాడు. టీ20 క్రికెట్లో 2010 ఐసీసీ టీ20 వరల్డ్ సందర్భంగా వెస్టిండీస్‌తో మాచ్‌లో అరంగేట్రం చేశాడు. చివరిసారిగా 2013లో శ్రీలంక పర్యటనకు వెళ్లిన కివీస్‌కు నికోల్ ప్రాతినిధ్యం వహించాడు.దేశీయ క్రికెట్‌లోనూ చాలా మ్యాచ్‌లు ఆడి అతనొక సాలిడ్ ఆల్ రౌండర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఫేస్, స్పిన్ బౌలింగ్‌లను ప్రదర్శించి 43 వికెట్లు తీశాడు.

 Image result for rob nicol retirement

నికోల్ దేశీవాలీ క్రికెట్ మ్యాచ్‌లు అయిన ఆక్లాండ్, కాంటర్‌బెర్రీ ఒటాగో లీగ్ లలో పాల్గొన్నాడు. ఇతనికి వీటితో పాటుగా ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లోనూ ఆడిన అనుభవం ఉంది. ఆడిన 130 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో.. 6319 పరుగులను చేశాడు. వీటిల్లో పది సెంచరీలు, 43వికెట్లు ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: