క్రికెట్ అంటే పాత తరానికైనా ఇప్పుడు ఉన్న కొత్త తరాలకైనా సరే ఎంత ఇష్టం అంటే తెలియాలంటే..ఒక్క ఆదివారం సమయంలో ఏ గల్లీ కి ఏ మైదానానికి వెళ్ళినా ఇట్టే తెలిసిపోతుంది..గల్లీ గల్లీ కీ ఇటుకలు వికెట్లుగా పేర్చి చిన్న చిన్న చెక్క ముక్కలతో కూడా చివరికి  స్కూల్ కి తీసుకు వెళ్ళే స్లేట్స్ తో కూడా క్రికెట్ ఆడేస్తారు..మనదేశంలో క్రికెట్ అంటే అంతగా పడిచస్తారు..అయితే మనదేశంలో కాకుండా ప్రపంచ దేశాలలో క్రికెట్ పై ఎంత ఆసక్తి ఉందో తెలుసుకోవడానికి ఐసీసీ ఒక సర్వే చేపట్టింది..ఆ సర్వే రిజల్స్ చూసిన ఐసీసీ కి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యిందట..ఇంతకీ ఆ సర్వే లో ఏమి తేలిందంటే..

 

16 నుంచి 69 మధ్య వయస్సు   గల వారిని ఆధారంగా చేసుకుని ఆడా మగా భేదం లేకుండా చేపట్టిన ఈ సర్వే లోప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల కు పైగా అభిమానులకు క్రికెట్‌ అంటే ఇష్టమని తేలింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇందులో 39 శాతం మంది మహిళలు, బాలికలు ఉన్నారట..అయితే 64 శాతం మంది టెస్టు..వన్డే..టీ20 ఫార్మాట్‌లను చూడ్డానికి ఇష్టపడుతున్నట్లు తెలిపారు...అతి తక్కువ సమయంలో క్రికెట్‌లో తక్కువ నిడివి ఫార్మాట్‌కు విశేష ఆదరణ దక్కింది...అంతేకాదు అభిమానులకు కూడా టీ20 క్రికెట్‌ చూడటమే ఎక్కువ ఇష్టమట..దాదాపు 92 శాతం మంది టీ20 క్రికెట్‌కే ఓటు వేశారు..

Image result for cricket fans in stadium

అయితే మూడింట రెండు వంతుల మంది మహిళల క్రికెట్‌ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. 70 శాతం  మంది మహిళల క్రికెట్‌ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరారట..అలాగే ఐసీసీ నిర్వహించే టోర్నీలను చూసేందుకే 95శాతం మంది ఓటు వేశారు. ఇందులో ముఖ్యంగా వన్డే, టీ20 ప్రపంచకప్‌లదే అగ్రస్థానం.యా.అయితే చాలా మంది అభిమానులు అంటే దాదాపు 87శాతం మంది టీ20లను ఒలింపిక్స్‌లో చేర్చాలని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట.

 


మరింత సమాచారం తెలుసుకోండి: