ధోనీ తన జీవితంలో ఎన్ని గొప్ప గొప్ప విజయాలు..మరెన్నో గొప్ప గొప్ప ప్రశంసలు అందుకునే ఉండిఉంటాడు.. అయితే ఎప్పుడూ ధోనీ అనుభవించని అనుభూతి ఆ ఒక్క రోజు అనుభవించాడు తానూ బ్రతికి ఉన్నంతకాలం ఆ రోజుని ఒక గొప్ప రోజుగా భావిస్తానని చెప్పాడు ధోనీ ఇంతకీ ఆరోజు ఏమిటి..అంతగా గుర్తు ఉండిపోయిన ఆ క్షణాలు ఏమిటి..? అయితే ఆ రోజు ఒక్క ధోనీ కి మాత్రమే కాదు భారత దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలకి కూడా ఎంతో సంతోష కరమైన రోజు..అదే ఏప్రియల్ 2 ప్రతీ భారత క్రికెట్ అభిమాని మర్చిపోలేని రోజు ముఖ్యంగా ధోనీ కి ఎంతో ఇష్టమైన రోజు.వివరాలలోకి వెళ్తే...

 Image result for 2nd world cup india wankhede stadium

ఏప్రియల్ 2 ఎందుకు అంత ప్రత్యేకమైన రోజు అంటే  ధోని నాయకత్వంలోని టీమిండియా 2011లో ఇదే రోజున భారత అభిమానులుకి  రెండో వన్డే వరల్డ్ కప్‌ని అందించింది...వరల్డ్ కప్ ఫైనల్ లో భాగంగా శ్రీలంకతో వాంఖడె స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో భారత్ అఖండ విజయాన్ని సాధించింది..అయితే అదే రోజున ధోనిని పద్మభూషణ్ అవార్డు వరించింది...భారత క్రికెట్‌కు ధోని చేసిన సేవలకు గాను ఇంతకముందే భారత ప్రభుత్వం పద్మ శ్రీ తో ధోనీని సత్కరించింది..ఆ తరువాత దేశంలో అత్యన్నతమైన పురస్కారం అయిన పద్మ విభూషణ్ దక్కింది..రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన ఆ పురస్కారాని అందుకున్నారు.

 Image result for 2nd world cup india wankhede stadium

1983 లో కపిల్ ఆధ్వర్యంలో ఇండియా వరల్డ్ కప్ సాధించిన తరువాతా మళ్ళీ ఎప్పుడు కూడా వరల్డ్ కప్ భారత్ గెలిచినా ధాకలా లేదు ఈ తరుణంలో భారత ప్రజలు అందరూ మళ్ళీ వరల్డ్ కప్ గెలుపుకోసం ఎదురు చూస్తున్న తరుణంలో దాదాపు 28 ఏళ్ల తరువాత ధోనీ భారత్ కి వరల్డ్ కప్ అందించాడు..దాంతో ఒక్కసారిగా అందరూ ఉద్వేగానికి లోనయ్యారు..అందరి కల దోనీ తీర్చేశాడు భారత క్రికెట్ అభిమానులకి ఆరాధ్యుడు అయ్యాడు అందుకే ధోనీ కి క్రికెట్ అభిమానులకి ఏప్రిల్ -2 ఎంతో మరిచిపోలేని రోజుగా నిలిచిపోయింది...వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ రోజున ధోనీ ,యువరాజ్ 49 ఓవర్ లో మొదటి బంతిని యువరాజ్ ఒక పరుగు తీసి ధోనీ కి అందించగా ధోని కులశేఖర్ వేసిన రెండో బంతికి సిక్స్ కొట్టి విజయంతో పాటు వరల్డ్ కప్ అందించాడు.

 

 

కోహ్లీ ఔటైన తర్వాత యువరాజ్ సింగ్ క్రీజులోకి వస్తాడని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా ధోని బరిలోకి దిగాడు. గంభీర్‌తో కలిసి ధోనీ దూకుడు మొదలుపెట్టాడు. ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో గంభీర్ (97) పరుగుల వద్ద పెరీరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. గంభీర్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్ (21 నాటౌట్) సహకారంతో ధోని (91 నాటౌట్: 79 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) వీర విహారం చేశాడు. దీంతో భారత్‌ విజయానికి నాలుగు పరుగులు కావాల్సి ఉంది.

స్టేడియంలో అభిమానుల కేరింతలు, సందడి మధ్య 49వ ఓవర్‌ మొదలైంది. తొలి బంతిని ఎదుర్కొన్న యువరాజ్ సింగ్ సింగిల్ తీసి ధోనీకి స్ట్రైకింగ్‌ ఇచ్చాడు. కులశేఖర వేసిన రెండో బంతిని ఎదుర్కొన్న ధోని దానిని భారీ సిక్సర్‌గా మలిచి భారత్‌కు వరల్డ్ కప్ అందించాడు. ఆ సిక్సర్ మాత్రం భారతీయుల గుండెల్లో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది. ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. దీంతో రెండోసారి వరల్డ్ కప్ గెలవాలన్న భారత అభిమానుల 28 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: