టీం ఇండియా వికెట్ కీపర్ గా మిడిల్ ఆర్డర్ గా బ్యాటింగ్ కు దిగే అతను కాస్త తన బ్యాటింగ్ నైపుణ్యంతో జట్టు విజయానికి కారణమయ్యాడు. అంతేకాదు నాయకత్వ లక్షణాలతో అందరిని ఆకట్టుకున్నాడు. బెస్ట్ ఫినిషర్ గా పిలిచే అతను కెప్టెన్సీలో భారత్ కు ఎన్నో గొప్ప విజయాలను అందించాడు. అతనే వన్ అండ్ ఓన్లీ ఎమ్మెస్ ధోని.


పాకిస్థాన్ తో 148 పరుగులు అతని మీద ఆశ కలిగేలా చేయగా.. శ్రీలంక మీద కొట్టిన 183 పరుగులు ధోని టాలెంట్ ప్రపంచానికి తెలియచేశాయి. అప్పటి నుండి క్రీజ్ లో దిగాడు అంటే ప్రత్యర్ధి బౌలర్ల మీద దాడి జరిగినట్టే. బ్యాట్స్ మన్ గానే కాదు కెప్టెన్ గా కూడా భారత జట్టు చిరస్మరణీయమైన విజయాలను అందుకునేలా చేశాడు. 


రైల్వే టిసి ఉద్యోగం వదిలి ధోని ఇండియన్ టీం కెప్టెన్ గా మారిన తీరు అద్భుతం. ప్రస్తుతం కెప్టెన్ గా వైదొలగినా ఓ ఆటగాడిగా తన ప్రతిభ చాటుతున్న ధోనిలో ఏమాత్రం గర్వం కనబడదు. అందుకే ఆయన ఈతరం యువతకు ఆదర్శప్రాయుడు. క్రికెట్ ఇండియాకు ఆయన చేసిన.. చేస్తున్న సేవలకు గాను పద్మభూషణ్ తో సత్కరించింది భారత ప్రభుత్వం.      


మరింత సమాచారం తెలుసుకోండి: