ఎంతో ఉత్కంట భరితంగా సారిగిన ఫిఫా వరల్డ్ కప్ క్రీడా ప్రపంచాన్ని ఒక దుమ్ము దులిపేసింది..ఎవరికి వారు ఎంతో హోదా హోరీగా పోటీలు పడుతూ సాగిన ఈ ఫిఫా యుద్దంలో ఆదివారం తో  ఫైనల్‌తో ముగిసింది. భారీ అంచనాల మధ్య అడుగుపెట్టిన జర్మనీ..అర్జెంటీనా..స్పెయిన్..పోర్చుగల్ లాంటి జట్లు రణరంగం నుంచీ తప్పుకోగా ఎలాంటి అంచనాలతో లేని ఫ్రాన్స్, క్రొయేషియా జట్లు అనూహ్యంగా ఫైనల్‌కి చేరి అందరికి ఆశ్చర్యాన్ని కలిగించాయి..

 Image result for fifa final 2018

ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మాజీ ఛాంపియన్ ఫ్రాన్స్ 4-2 తేడాతో క్రొయేషియాని ఓడించి రెండోసారి ప్రపంచకప్‌ని ఎగరేసుకుపోయింది...ఎంతో వైవిధ్యభరితమైన ఆటతీరుతో తిరుగులేని ప్రదర్సన ఇచ్చిన జట్టుగా ఫ్రాన్స్ 2018 విజేతగా నిలిచింది...అయితే 1998లో తొలిసారి ఫిఫా ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన ఫ్రాన్స్..ఆ తరువాత కప్ గెలిచినా ధాకలాలు లేవు అయితే ఎన్నో ఏళ్ల తరువాత మళ్ళీ జట్టు కప్ గెలవడంతో దేశాధ్యక్షుడు మొదలు అందరూ మైమరిచిపోయారు..సంతోషంతో చిందులు వేశారు..

 Image result for fifa final 2018

ఫ్రాన్స్‌ ఆదివారం జరిగిన ఫైనల్లో 4-2తో క్రొయేషియాను ఓడించింది..చరిత్రలో రెండో సారి కప్పును అందుకుంది. క్రొయేషియా ఆటగాడు మంజుకిచ్‌ సెల్ఫ్‌ గోల్‌ (18వ)తో ఖాతా తెరిచిన ఫ్రాన్స్‌కు గ్రీజ్‌మన్‌ (38వ, పెనాల్టీ), పోగ్బా (59వ), ఎంబపె (65వ) తలో గోల్‌ అందించారు. క్రొయేషియా తరఫున పెరిసిచ్‌ (28వ), మంజుకిచ్‌ (69వ) చెరో గోల్‌ చేశారు. ఆత్మవిశ్వాసం సన్నగల్లిన క్రొయేషియా ఆ తర్వాత ఇంకా గోల్‌ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.

 

అవార్డుల పంట పండిన జట్లు

 Image result for fifa final 2018 awards teams

  • టైటిల్‌ను గెలవలేకపోయినా సరే క్రొయేషియా పోరాట పటిమతో అభిమానుల మనసులు గెల్చుకుంది. టోర్నీలో ప్రత్యర్థుల నుంచి మొత్తంగా 301 దాడులను కాపాడుకుని 'ఉత్తమ డిఫెండింగ్' జట్టుగా క్రొయేషియా నిలిచింది. ఉత్తమ ప్రదర్శన కనబర్చిన క్రొయేషియా ఆటగాడు లూకా మోద్రిచ్‌కి 'గోల్డెన్‌ బాల్‌' అవార్డు దక్కింది.

 

  • ఇదిలాఉంటే జట్టు కోచ్‌గా ప్రపంచచకప్పు గెలిచిన మూడో వ్యక్తిగా ఫ్రాన్స్‌ కోచ్‌ డెషాంప్స్‌ ఘనత సాధించాడు. ఉత్తమ యువ ఆటగాడికి ఇచ్చే 'యంగ్ ప్లేయర్' అవార్డ్ ఫ్రాన్స్‌కి చెందిన ఎంబపెకి దక్కింది.

 

  • జూన్ 14న ఆరంభమైన ఫిఫా ప్రపంచకప్‌లో మొత్తం 169 గోల్స్ నమోదయ్యాయి. ఇందులో బెల్జియం జట్టు మాత్రమే కొట్టిన గోల్స్‌ 16 కావడం విశేషం.

 

 

  • టోర్నీలో అత్యధిక గోల్స్‌ కొట్టిన ఆటగాడికి ఇచ్చే 'గోల్డెన్‌ బూట్‌' ఈసారి ఇంగ్లాండ్‌ స్టార్ హ్యారీకేన్ సొంతమైంది. అతను మొత్తం 6 గోల్స్ చేశాడు.

 

 

  • ఉత్తమ గోల్‌ కీపర్‌గా బెల్జియం గోల్‌ కీపర్ తిబాట్ కోర్టొయిస్ నిలిచి 'గోల్డెన్ గ్లోవ్'ని అందుకున్నాడు.

 

 

  • టోర్నీలో న్యాయబద్ధంగా ఆడిన జట్టుగా స్పెయిన్‌ 'ఫెయిర్ ప్లే' అవార్డుని దక్కించుకుంది.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: