ఏషియన్ గేమ్స్ -2018  మూడో రోజు కూడా భారత ఆటగాళ్ళ జోరు తగ్గడం లేదు..భారతావని మురిసిపోయెలా ఆటగాళ్ళు ఎంతో వైవిధ్యమైన ప్రదర్సన చేస్తున్నారు..ఆసియా గేమ్స్ మొదలైన మొదటి రోజునే పురుషుల విభాగంలో రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా స్వర్ణం సాధించగా రెండో రోజు మహిళల విభాగంలో రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ పసిడితో మెరిశారు. ఇక మూడో రోజు భారత యువ షూటర్‌ సౌరభ్‌ చౌదరి స్వర్ణ పతకాన్ని సాధించారు.

 Image result for asian games 2018

అయితే ఈ విజయాన్ని భారతీయలు ప్రతీ ఒక్కరు ఎంతో సంతోషంగా ఆస్వాదిస్తున్నారు..వరుసగా స్వర్ణాలు గెలుస్తూ భారత కీర్తిని ఇనుమడింప చేస్తున్నారు..అయితే మంగళవారం పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో భాగంగా ఫైనల్‌ పోరులో సౌరభ్‌ చౌదరి 240.7 పాయింట్లు సాధించి భారత ఖాతాలో మరో స్వరం తెచ్చి పెట్టాడు..మొదటి సెగ్మెంట్ నుంచే ఎంతో చక్కనియా ప్రతిభతో ఆకట్టుకున్న 16 ఏళ్ల సౌరభ్‌.. ఏషియన్‌ గేమ్స్‌లో 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో రికార్డు స్కోరు సాధించాడు..

 Image result for asian games 2018 shooting

 ఇదిలాఉంటే ఇదే విభాగంలో మరొక భారత షూటర్‌ అభిషేక్‌ వర్మ కాంస్య పతకాన్ని సాధించి రికార్డుల పట్టికలో భారత్ కి ఎదురు లేదని చెప్పకనే చెప్తున్నారు..మొత్తంగా 219.3 పాయింట్ల స్కోరు సాధించి కాంస్యాన్ని దక్కించుకున్నాడు. ఫలితంగా భారత్‌ ఖాతాలో ఏడు పతకాలు చేరాయి. ఇందులో మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు క్యాంస్యలు ఉన్నాయి..దాంతో మరిన్ని పతకాలు సాధించాలని భారతీయులు అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు..

 


మరింత సమాచారం తెలుసుకోండి: