ఆసియా గేమ్స్ లో నిన్న తలపడి ఫైనల్స్ కి దూసుకువచ్చిన సింధూ ఈరోజు జరిగిన ఫైనల్స్ లో ఓటమి పాలయ్యింది..అయితే సింధూ రజితం తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది..ఫైనల్లో వరల్డ్ నంబర్ వన్ తై జు యింగ్ చేతిలో 13-21, 16-21 తేడాతో వరుస గేమ్స్ లో సింధూ ఓటమిపాలయ్యింది..అయితే  సింధు ఓడినప్పటికీ చరిత్ర సృష్టించింది...అదేంటంటే..సింధూ ఓటమితో రజితంతో సరిపెట్టుకుంది కానీ

 Related image

మహిళల సింగిల్స్‌లో రజత పతకం సాధించిన తొలి భారతీయురాలిగా సింధు అరుదైన ఘనత సాధించింది. సింధూ స్వర్ణం సాధిస్తుందని వేచి చూసిన కోట్లాది మంది అభిమానులకి భారతీయులకి నిరాశే మిగిల్చింది.. ఆట ప్రారంభం నుంచీ కూడా సింధూ వెనకంజలోనే ఉంది..తొలి గేమ్‌ 0-5తో వెనుకంజలో ఉన్న సింధు ఆ తర్వాత కాస్త పోరాడింది.

 Image result for tai tzu ying badminton

డ్రాప్‌ షాట్లు, స్మాష్లు ఆడుతూ తైజూ ని సింధూ ఎదుర్కొనలేక పోయింది..కేవలం 16 నిమిషాల్లోనే ఆటని ముగించింది..ప్రత్యర్థి పదే పదే ఔట్ కొట్టడంతో వచ్చిన పాయింట్లు తప్ప సింధు సాధించిన పాయింట్లు తక్కువే అని చెప్పాలి. దీంతో సింధు 13-21తో తొలి సెట్‌ను కోల్పోయింది...దీంతో రెండో గేమ్‌ను సింధు 16-21తో ఓడిపోయి మ్యాచ్‌ను చేజార్చుకుని రజతంతో సరిపెట్టుకుంది. అయితే ఫైనల్స్ లో సింధూ గెలవక పోయినా  ఆసియా గేమ్స్ బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో రజతం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించింది..

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: