సచిన్ టెండూల్కర్ క్రికెట్ లో అతడో ఎవరెస్ట్..ఎంతో మందికి స్పూర్తి ప్రదాత..సచిన్ ని స్పూర్తిగా తీసుకుని ఒక్క క్రికెట్ రంగంలోనే కాదు ఇతర రంగాలలో కూడా అత్యున్నతమైన స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ లిస్టు లో తన కూతురుకూడా చేరిపోయింది..ఇప్పుడు తన కూతురు ఎదుగుదల చూసిన సచిన్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బై పోతున్నాడు అంతేకాదు తన సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు..వివరాలలోకి వెళ్తే..

 Image result for sachin tendulkar daughter sara

సచిన్ కూతురు గారాల పట్టి సారా టెండూల్కర్ ప్రఖ్యాత లండన్ యూనివర్సిటీలో మెడిసిన్ డిగ్రీ పూర్తి చేసింది. తాజాగా శుక్రవారం జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో తల్లీదండ్రులతో కలిసి సారా టెండూల్కర్ పాల్గొంది..ఈ వేడుకకి సంభందించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..తనకొడుకు క్రికెట్ నే కెరియర్ గా ఎంచుకోగా కూతురు మాత్రం తన తల్లి అంజలి బాటలోనే నడుస్తుండటంతో పాటు మెడిసిన్ లో డిగ్రీ చేయడం ఎంతో సంతోషమైన విషయమే.

 Image result for sara doctarate sachin

తన కూతురు సాధించిన ఈ ఘనతని సచిన్  ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. "నిన్న గాక మొన్న నువ్వు ఇంటిని వదిలి..స్కూల్‌కి వెళ్లినట్టు అనిపిస్తోంది. ఇప్పుడు నువ్వు ఓ గ్రాడ్యుయేట్‌వి. అంజలి, నేను నిన్ను చూసి చాలా గర్విస్తున్నాం. నువ్వు ఇక ప్రపంచాన్ని చుట్టిరావచ్చేమో" అంటూ సచిన్ ఎంతో భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు...ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: