ధోనీ మాజీ టీమిండియా కెప్టెన్..క్రికెట్ సారధ్య భాద్యతల నుంచీ ధోనీ తప్పుకుని చాలా కాలం అయ్యింది అయితే తన మార్క్ కెప్టెన్సీ ని ధోనీ మరో మారు చూపించాడు.కెప్టెన్సీ వదులుకున్నా ఓ సీనియర్‌ ఆటగాడిగా జట్టులో తానూ ఏ విధంగా ఉపయోగపడగలడో ఆ తీరిలో తన సేవలని అందిస్తున్నాడు.. తాజాగా  లో భాగంగా బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ధోని మరోసారి తన మార్క్‌ కెప్టెన్సీని చూపించాడు.

 Mahendra Singh Dhoni Plotted the Wicket of Shakib Al Hasan - Sakshi

బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ధోని తాత్కాలిక కెప్టెన్ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు తన వ్యూహాలని వివరించి జట్టులో కీలక పాత్ర పోషించాడు..జడేజా వేసిన తొలి ఓవర్‌లోనే షకీబ్‌ వరుస బౌండరీలతో రెచ్చిపోయాడు. దీంతో స్లిప్‌లో ఉన్న ధావన్‌ను స్క్వేర్‌ లెగ్‌కు మార్చాలని ధోని, రోహిత్‌కు సూచించాడు. వెంటనే రోహిత్‌ ఫీల్డింగ్‌ మార్చగా.. ఆ మరుసటి బంతికే షకీబ్‌.. ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

 Image result for asia cup india vs bangladesh

దాంతో ఒక్క సారిగా ధోనీ వ్యూహం అర్థం అయ్యింది అభిమానులు అందరూ షాక్ కి గురయ్యారు దటీజ్ ధోనీ అంటూ నినాదాలు హోరేత్తించారు..ఆ తరువాత  ధోని మార్క్‌ కెప్టెన్సీ పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ధోని నుంచి కెప్టెన్సీ దూరం కావచ్చు కానీ,  తనలోని సారథ్య లక్షణాలు మాత్రం కోల్పోలేదని.. అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: