టీమిండియా కెప్టెన్ కోహ్లీ రికార్డుల కోటలని బద్దలు కొడుతున్నాడు వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆటలో టీమిండియా తన ఆధిపత్యాన్ని కొనసాగితూనే ఉంది అయితే...తొలి రోజు ఆటలో పృథ్వీ షా మెరుపు సెంచరీ చేయగా.. పుజారా మాత్రం సెంచరీని మిస్ చేసుకున్నాడు అయితే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మాత్రం విండీస్‌కు చాన్స్‌ ఇవ్వకుండా కెరీర్‌లో 24వ సెంచరీ సాధించాడు...దాంతో టెస్ట్ మ్యాచ్ లలో వేగంగా 24వ శతకాలు సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు.

 Image result for west indies vs india 2018

అంతేకాదు టెస్ట్‌ చరిత్రలో డాన్‌ బ్రాడ్‌మన్‌ ఒక్కడే 66 ఇన్నింగ్స్‌లో 24 సెంచరీలు సాధించాడు..టెస్ట్ లలో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ళలో సెహ్వాగ్ రికార్డ్ ని కోహ్లీ దాటేశాడు....అయితే 51 సెంచరీలతో సచిన్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉండగా ద్రవిడ్‌ (36), సునీల్‌ గవాస్కర్‌ (34)లు కోహ్లి కన్నా ముందు ఉన్నారు.72 టెస్టుల్లో కోహ్లి 24 సెంచరీలు సాధించగా 103 టెస్టుల్లో సెహ్వాగ్‌ 23 సెంచరీలు పూర్తి చేశాడు.

 Related image

ఇంగ్లండ్‌ పర్యటననంతరం  రెస్ట్ తీసుకున్న కోహ్లీ మళ్ళీ ఆట బరిలోకి దిగిన వెంటనే తన సత్తా ఏమిటో చాటుకున్నాడు...సొంతగడ్డపై టెస్టుల్లో మూడువేల పరుగులు సాధించాడు...ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మాథ్యూ హెడెన్‌ ఒక్కడే 2001-2005 వరకు వరుసగా ఐదుసార్లు వెయ్యికి పైగా పరుగులు సాధించి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఏది ఏమైనా కోహ్లీ మళ్ళీ వెస్ట్ ఇండీస్ మ్యాచ్ ఎంట్రీ తో  తన సత్తా మళ్ళీ చాటుకున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: