టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పై జట్టులోకి కొత్తాగా వచ్చిన యువ క్రికెటర్ ఖలీల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు..ధోనీ గురించిన సంచలన విషయాలు వెల్లడించాడు. ఇంతకీ ఖలీల్ ఏమి చెప్పాడు..అసలేం జరిగింది. అనే వివరాలలోకి వెళ్తే...సహజంగా ఏ జట్టుఅయినా సరే ట్రోఫీ కొట్టిన సందర్భంలో ఆ జట్టుకి వచ్చిన ట్రోఫీ ని ఆ జట్టు కెప్టెన్ పట్టుకుని ఫోటోలు దిగడం..చూస్తూ ఉంటాం కానీ ఇండియా టీం మాజీ కెప్టెన్ ధోనీ మాత్రం అలా కాదు..

 Image result for asia cupfinal winner team 2018

ధోనీ  కెప్టెన్‌గా ఉన్న సమయంలో అందుకు విరుద్ధంగా వ్యవహరించేవాడు. జట్టు మొత్తానికి కప్ అప్పగించేసి ధోని పక్కన ఉంటడం ఎన్నో సార్లు అందరూ చూసే ఉంటారు..అదే సమయంలో  కుర్రాళ్లను ప్రోత్సహించడంలో ధోని ఎప్పుడూ ముందువరసలో ఉంటాడు అందుకు కారణం కష్టపడి క్రికెట్ జీవితంలో తానూ ఎదిగిన క్రమమే.అయితే ఈ విషయంలో అతను మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నాడు.

 Image result for asia cupfinal winner team 2018

ధోని కెప్టెన్ కాకపోయినా జట్టులో అతని మాటకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటూనే ఉంటుంది..ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్-బంగ్లాదేశ్‌తో తలపడింది. యూఏఈలో భారత జట్టు ఆసియా కప్‌ గెలిచిన సందర్భంగా సంబరాల చేసుకుంటున్న సమయంలో ధోని రోహిత్ శర్మ తో ఖలీల్ కి ఆ ట్రోఫీ చేతికి ఇవ్వు అని చెప్పాడట.. ఆ విషయాన్ని ఖలీలే స్వయంగా వెల్లడించాడు...జట్టులో అందరి కంటే జూనియర్‌ నేనే కావడంతో ట్రోఫీ నా చేతికి ఇప్పించాడు. అది నాకు మరపురాని అనుభవం' అని ఖలీల్‌ చెప్పాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: