పుల్వామా ఘటన తో దేశం మొత్తం ద్రిగ్భ్రాంతి కి గురైంది . అయితే టీమిండియా పేసర్ షమీ జవాన్లకు కొంత మొత్తం విరాళంగా ప్రకటించారు.  భారత జట్టు జవాన్లకు ఎల్ల వేళలా అండగా ఉంటుందని , "మేము దేశం కోసం ఆడితే వారు దేశాన్ని కాపాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియా సిరీస్ గెలిచి వారికి ఘనమైన నివాళి ఇస్తామని తెలిపారు. పాకిస్థాన్ తో క్రికెట్ ఆడేది ఉంటుందా .. ఉండదా అని కేంద్ర ప్రభుత్వం , బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది అని "  తెలిపారు. 

Image result for mohammed shami

అయితే పుల్వామా ఉగ్ర దాడి భారత్ , పాక్ మధ్య యుద్ధ వాతావరణాన్ని స్ఫురిస్తుంది. ఇప్పటికే దేశం మొత్తం పాకిస్తాన్ పై తీవ్ర కోపంతో ఊగిపోతోంది. చాలా మంది పాకిస్థాన్ కు యుద్ధం తోనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటీకే ఇప్పటికే భారత క్రికెటర్ హర్బజన్ పాకిస్తాన్ తో ఎట్టి పరిస్థితిలో క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదని కొండబద్దలు కొట్టినాడు. 

Image result for mohammed shami

అలాగే రాజీవ్ శుక్లా కూడా ప్రపంచ కప్ లో పాకిస్తాన్ ఆడేది కష్టమేనని మాట్లాడినాడు.మాజీ బీసీసీఐ సెక్రటరీ సంజయ్ పటేల్ మాట్లాడుతూ ''దేశం కంటే క్రికెట్ ఎక్కువ కాదని ఓక వేళ పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడినట్లైతే దేశం కంటే క్రికెట్ ఎక్కువేనని ఒప్పుకున్నట్లు అవుతుందని ఘాటుగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యం లో ప్రపంచ కప్ లో పాకిస్తాన్ తో ఆడేది అనుమానంగా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: