భారత్  ఆసీస్ కు మధ్య జరిగి టీ 20 మ్యాచ్ లో భారత్ 126 తక్కువ టార్గెట్ ను నిర్దేశించిన చివరి వరకు కాపాడుకుంటూ పోరాడి ఓడిపోయింది. భారత్ నిర్దేశించిన 127 పరుగుల లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియాకు మెరుగైన శుభారంభం దక్కలేదు. 5 పరుగులకే స్టోయినిస్(1) వికెట్‌తో పాటు కెప్టెన్ ఫించ్(0) వికెట్లను కోల్పోయింది. రెండు కీలక వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు వచ్చిన మ్యాక్స్‌వెల్(56) తనదైన శైలిలో వీరవిహారం చేశాడు.

Image result for india and australia

బౌండరీతో బోణీ కొట్టిన మ్యాక్స్‌వెల్.. ఉమేశ్ నాలుగో ఓవర్లో మూడు ఫోర్లతో తన ఉద్దేశమేంటో చాటిచెప్పాడు. పరుగుల రాకను బుమ్రా నియంత్రించినా మిగతా బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ మ్యాక్స్ బౌండరీల దాడి కొనసాగించాడు. పవర్ ప్లే ముగిసే సరికి ఆసీస్ 2 వికెట్లకు 41 పరుగులు చేసింది. వీరిద్దరి బ్యాటింగ్ చూస్తే.. ఆసీస్‌కు అలవోక విజయం ఖాయమనుకున్నారు. కానీ చాహల్ మాయ చేశాడు.

kohli1

భారీ షాట్ ఆడే క్రమంలో లాంగ్ ఆఫ్‌లో రాహుల్ క్యాచ్ పట్టడంతో మ్యాక్స్‌వెల్ నిష్క్రమించాడు. దీంతో మూడో వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యానికి ముగింపు పడింది. మ్యాక్స్‌వెల్ ఔటయ్యే సమయానికి ఆసీస్ విజయానికి 35 బంతుల్లో 36 పరుగులు అవసరముండే. ఇక్కణ్నుంచి మ్యాచ్ భారత్ వైపు మొగ్గింది. వరుస ఓవర్లలో డార్కీషార్ట్, టర్నర్(0) ఔట్ కావడంతో కంగారూల శిబిరంలో ఆందోళన నెలకొన్నది. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌కు దిగిన బుమ్రా.. మ్యాచ్‌ను మలు పు తిప్పాడు. తొలి నాలుగు బంతుల్లో రెం డు పరుగులిచ్చుక్ను బుమ్రా..ఆఖరి రెండు బంతు ల్లో వరుసగా హ్యండ్స్‌కోంబ్(13), కౌల్టర్‌నైల్(4)ను పెవిలియన్ పంపడంతో విజయ సమీకరణం 6 బంతుల్లో 14గా మారింది. అయితే ఆఖరి ఓవర్ వేసిన ఉమేశ్ రెండు ఫోర్లు సమర్పించుకోవడంతో ఆసీస్ చివరి బంతికి విజయాన్నందుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: