నిన్న ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ ఒక విచిత్రమైన మ్యాచ్ గా చెప్పాలి. ఇండియా నెగ్గాలని పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి పక్కదేశాలు.. ఎక్కడో ఉన్న న్యూజిలాండ్ కోరుకుంటే, ఇండియా నెగ్గకపోయినా ఫర్వాలేదని భారత అభిమానులు కోరుకున్నారు! ఇండియా నెగ్గితే పాకిస్తాన్ సెమిస్ అవకాశాలు సజీవంగా ఉండేవి. బంగ్లాదేశ్ కు కూడా ఇంకా ఎక్కడో ఉన్న ఆశలు భద్రంగా ఉండేవి. న్యూజిలాండ్ కూడా ఇప్పుడు దాదాపుగా తప్పనిసరిగా ఇంగ్లండ్ తో నెగ్గాల్సిన పరిస్థితుల్లోకి పడిపోయింది.


ఇండియా ఓటమి మూడుదేశాల జట్లను ఇరకాటంలోకి నెట్టింది! అయితే ఇండియన్ ఫ్యాన్స్ మాత్రం నిన్న టీమిండియా ఓడిపోయినా ఫర్వాలేదనే ధీమాతో టీవీలకు అతుక్కపోయారు. ఇంగ్లండ్ నిర్దేశించిన భారీ స్కోరును ఒకదశలో టీమిండియా చేజ్ చేసేలానే కనిపించింది. అయితే రోహిత్ శర్మ, కొహ్లీలు అంత వేగంగా ఆడకపోవడం.. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మన్ కూడా ధాటిగా ఆడలేకపోవడంతో.. చివరకు ముప్పై ఒక్క పరుగుల దూరంలో నిలిచిపోయింది.


ఈ మ్యాచ్ లో మన వాళ్లు నెగ్గి పాకిస్తాన్ కు ఎందుకు అవకాశం ఇవ్వాలనే తీరున ఆలోచించిన ఇండియన్లు.. మ్యాచ్ పోయినా బాధపడటం లేదు. ఎలాగూ టీమిండియాకు మరో రెండు మ్యాచ్ లున్నాయి. వాటిల్లో ఒకటి శ్రీలంక మీద, మరోటి బంగ్లాదేశ్ మీద.. వాటిల్లో సునాయాసంగా నెగ్గి పాయింట్స్ చార్ట్ లో నంబర్ వన్ పొజిషన్లో నిలుస్తుంది టీమిండియా అనే ధీమాతో ఉన్నారు భారత అభిమానులు. ఇక ఈ మ్యాచ్ లో విజయంతో ఇంగ్లండ్ సెమిస్ అవకాశాలు మెరుగయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: