2019 ప్రపంచ కప్ విన్నర్ గా ఆతిధ్య జట్టు ఇంగ్లాండ్ అద్భుత విజయాన్ని అందుకుంది. లార్డ్స్ లో న్యూజిల్యాండ్ తో ఫైనల్ మ్యాచ్ తలపడ్డ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిల్యాండ్ 50 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 241 పరుగ్లు చేసింది. హెన్రీ నికోల్స్ 55, విలియం సన్ 30, టామ్ లాథం 47 పరుగులు చేశారు.   


ఇక 242 పరుగుల లక్ష్యంతో దిగిన ఇంగ్లాండ్ జట్టు టాప్ ఆర్డర్ విఫలమైంది. జానీ బరిస్టో 37 పరుగులు చేయగా భారమంగా మిడిల్ ఆర్డర్ మీద పడ్డది. ఇక జట్టుకి అవసరమైన సందర్భంలో ఆదుకునే బెన్ స్టోక్స్ ఈరోజు ఇంగ్లాండ్ ను విశ్వవిజేతగా నిలబెట్టేందుకు సహకరించాడు. స్టోక్స్ 89, బట్లర్ 59 పరుగులు చేయగా చివరి ఓవర్లో తడబాడు వల్ల 50 ఓవర్లకు సరిగ్గా 241 పరుగులు చేసి మ్యాచ్ ఈక్వల్ చేశారు. 


అయితే డ్రా అయిన మ్యాచ్ లకు కొత్తగా సూపర్ ఓవర్ ప్రక్రియ ఉంది కాబట్టి మొట్టమొదటిసారి వరల్డ్ ఫైనల్ మ్యాచ్ లో సూపర్ ఓవర్ వేశారు. సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేయగా ఒక్క ఓవర్లో 15 పరుగ్లు చేసింది. ఇక 16 పరుగులతో వరల్డ్ కప్ గెలవాలన్న ఆలోచనతో న్యూజిల్యాండ్ సూపర్ ఓవర్ లో కూడా 15 పరుగులు చేశారు. అయితే సూపర్ ఓవర్ కూడా ఈక్వల్ రన్స్ రాగా మ్యాచ్ లో ఎక్కువ బౌండరీస్ సాధించిన జట్టు విజేతగా నిలుస్తుందని తెలిసిందే. ఇన్నింగ్స్ లో న్యూజిల్యాండ్ 16 బౌండరీస్ మాత్రమే కొట్టగా.. ఇంగ్లాండ్ 24 బౌండరీస్ కొట్టడంతో మ్యాచ్ విన్నర్ గా నిలిచింది. 


ఇంగ్లాండ్ జట్టు 45 ఏళ్లుగా కంటున్న కల ఈరోజు నిజమైంది. వరల్డ్ కప్ విజేతగా ఇంగ్లాండ్ సరికొత్త సంచలనం సృష్టించింది. ఇయాన్ మోర్గాన్ సారధ్యంలో ఇంగ్లాండ్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. అయితే రన్నరప్ అయ్యి న్యూజిల్యాండ్ కప్ గెలవకపోయినా క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: