భారత స్టార్‌ అథ్లెట్‌ హిమదాస్‌ కేవలం 18 రోజుల వ్యవధిలో అంతర్జాతీయ టోర్నమెంట్‌లో అయిదోవ స్వర్ణ పతకం దక్కించుకుంది. చెక్ రిపబ్లిక్‌లో జరుగుతున్న టబొర్ అథ్లెటిక్ మీట్‌లో శనివారం 400 మీటర్ల రేసులో హిమాదాస్ కేవలం 52 నిమిషాల 09 సెకన్లలో గమ్యాన్ని చేరుకొని అయిదోవ బంగారు పతకం గెలిచింది.  


కాగా కేవలం 19 ఏళ్ళు వయసు ఉన్న హిమదాస్ ఇప్పటి వరకు 200 మీటర్ల రేసులో కేవలం 23 నిమిషాల 10 సెకెన్ల నడవిలో గమ్యాన్ని చేరుకొని రీకార్డ్ సొంతం చేసుకుంది. ఈ సంవత్సరం జులై 2 వ తేదీ నుంచి జరిగిన రేసుల్లో 5 బంగారు పతకాలు సాధించి యావత్ దేశాన్ని గర్వ పడేలా చేసింది. 


అయితే జులై 2వ తేదీన జరిగిన పొజన్ అథ్లెటిక్ గ్రాండ్‌ప్రీలో 200 మీటర్ల రేసును 23 నిమిషాల 65 సెకన్లలో పూర్తి చేసి గోల్డ్ మెడల్ గెలుచుకున్న హిమదాస్, 7వ తేదీన కుంటో అథ్లెటిక్ మీట్‌లో 23 నిమిషాల 97సెకన్ల టైమింగ్‌‌తో రెండో గోల్డ్‌ను సాధించింది. 13వ తేదీన క్లాడ్నో అథ్లెటిక్ మీట్‌లో 23 నిమిషాల 43 సెకన్లలో రేస్ పూర్తిచేసి మూడో గోల్డ్‌కు దక్కించుకుంది. 


17 వ తేదీన టబొర్ అథ్లెటిక్ మీట్‌లో 200 మీటర్ల రేసును హిమదాస్ కేవలం 23 నిమిషాల 25 సెకన్లలో గమ్యాన్ని చేరుకుని బంగారు పతకం గెలిచింది. 20వ తేదీన శనివారం జరిగిన 400 మీటర్ల రేసులో హిమాదాస్ కేవలం 52 నిమిషాల 09 సెకన్లలో గమ్యాన్ని చేరుకొని భారత్ కు అయిదోవ బంగారు పతాకాన్ని తెచ్చిపెట్టింది. ఈ విషయాన్నీ ఆమె ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ ట్విట్ చుసిన ఎంతో మంది నెటిజన్లు ఆమెని అభినందిస్తూ, ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 


కాగా ఒకప్పుడు ఆమెకు షూ కొనడానికి కూడా ఆమె దగ్గర డబ్బులు లేవు అలాంటి కుటుంబం నుంచి వచ్చింది హిమ దాస్. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేరు గాంచిన అడిడాస్ షూ కంపెనీ ఆమె పేరుపై ఒక బ్రాండెడ్ 'షూ'ని తయారుచేసింది. ఒకే నెలలో 5 బంగారు పథకాలను భారత్ కి తీసుకొచ్చిన యువతీ హిమ దాస్. అయితే 'ఇంతటి విజయాన్ని తీసుకొచ్చిన హిమ దాస్ ఒక్క తెలుగు వెబ్ సైట్ కూడా ఈ న్యూస్ కవర్ చెయ్యలేదంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.'

Finished 400m today on the top here in Czech Republic today 🏃‍♀️ pic.twitter.com/1gwnXw5hN4

మరింత సమాచారం తెలుసుకోండి: