ఇటీవల యుకెలో ముగిసిన ఐసిసి ప్రపంచ కప్‌లో దేశం పరాజయం పాలైన నేపథ్యంలో "ప్రపంచంలోని ఉత్తమ క్రికెట్ జట్టు" ను అభివృద్ధి చేసే ప్రణాళికలో తాను పనిచేస్తున్నానని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్-అమెరికన్లకు హామీ ఇచ్చారు.

ఆదివారం వాషింగ్టన్ డిసి దిగువ పట్టణంలోని కాపిటల్ వన్ అరేనాలో పాకిస్తాన్-అమెరికన్ల సమావేశంలో ప్రసంగిస్తూ  రాజకీయ నాయకుడుగా మారిన క్రికెటర్   ఈ విషయం చెప్పారు. పాకిస్తాన్ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ తదుపరి ఐసిసి మెగా ఈవెంట్ కోసం ప్రపంచంలోని ఉత్తమ క్రికెట్ జట్టును అభివృద్ధి చేస్తానని చెప్పారు

ఇటీవల ముగిసిన ఐసిసి ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ జట్టు పరాజయం గురించి ప్రస్తావించిన ఖాన్, " జట్టులోకి ఉత్తమ ఆటగాళ్లను తీసుకురావడం ద్వారా తరువాతి టోర్నమెంట్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెట్ జట్టును అభివృద్ధి చేయడానికి కృషి చేయడం ప్రారంభించానని" అని చెప్పారు.

"నా మాటలు గుర్తుంచుకోండి" అని 1992 నాటి క్రికెట్ ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌ను విజయానికి కారణమైన క్రికెటర్-ప్రధాని  తెలిపారు కానీ ఖాన్ తన ప్రణాళికల గురించి వివరాలు వెల్లడించలేదు.

ప్రస్తుతం అమెరికా మూడు రోజుల పర్యటనలో ఉన్న ఆయన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సోమవారం వైట్‌హౌస్‌లో కలవనున్నారు. జూన్ 16 న జరిగిన కీలకమైన ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిపోతుందనే భయాన్ని తొలగించడానికి ఖాన్ దేశ క్రికెట్ జట్టుతో కొంత సమయం వెచ్చించి వారికి ఆత్మస్థైరాన్ని నింపాను అన్నారు, ఓడిపోతారనే భయం ప్రతికూల మరియు రక్షణాత్మక వ్యూహానికి దారితీస్తుందని అన్నారు.

భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన పాకిస్తాన్, ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్ రౌండ్‌లోకి ప్రవేశించలేక ఐదవ స్థానంలో నిలిచింది. ఈ టోర్నమెంట్‌ను ఇంగ్లాండ్ తొలిసారిగా గెలుచుకుంది. ప్రపంచ కప్‌లో జాతీయ జట్టు పేలవమైన ప్రదర్శనకు బోర్డు ప్రస్తుత నిర్వహణను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ నాజమ్ సేథి తప్పుబట్టారు


మరింత సమాచారం తెలుసుకోండి: