ప్రపంచకప్ నుంచి భారత్ నిష్ర్కమణ తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య విభేదాలు ఉన్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వచ్చి కొన్ని రోజులు హల్ చల్ చేశాయి. అయితే వారి మధ్య ఎటువంటి విబేధాలు లేవు అని గతవారం మీడియా ముందుకు వచ్చి కోహ్లీ వివరణ ఇచ్చాడు. బీసీసీఐ కూడా ఇదే విషయాన్నీ ట్విట్టర్ వేధికగా వెల్లడించింది. 


అయితే ఈ గొడవలు అన్ని నెటిజన్లు మర్చిపోతున్న సమయంలో టీమిండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరో 20 ఏళ్ళు వచ్చినా ఈ గొడవలు ప్రజలు మర్చిపోరని, వాళ్ళు ఇద్దరు ప్రొఫెషనల్సేనని అన్నారు. అయినప్పటికీ నెటిజన్లు ఇంకా గొడవలు జరుగుతున్నాయి ట్విట్లు పెట్టేసరికి కోహ్లీ, రోహిత్ ర్ల ఉంటారో అనేదానికి ఓ వీడియోని బీసీసీఐ ట్విట్టర్ లో విడుదల చేసింది.


వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా శుక్రవారం భారత్‌ జట్టు తొలి వన్డే వర్షం కారణంగా రద్దయ్యింది. ఈ క్రమంలోనే రవీంద్ర జడేజా, రోహిత్‌లు మూగ సైగల ద్వారా ఒక పోటీ పెట్టుకున్నారు. ఇందులో ఒక ఆటగాడ్ని ఒకరు అనుకరిస్తే మరొకరు వారి పేరు చెప్పాలి. దీనిలో భాగంగా తొలుత బుమ్రాను జడేజా ఇమిటేట్‌ చేశాడు. ఆ తర్వాత కోహ్లి శైలిని అనుకరించమని రోహిత్‌ ఫ్లకార్డు చూపించడంతో జడేజా అచ్చం అలానే చేసి చూపించాడు. 


కోహ్లి బల్ ని ఎదుర్కొనే క్రమంలో ఏమి చేస్తాడు, బల్ ఎలా విడిచిపెడతాడు అనే దానిని జడేజా మూగ సైగల ద్వారా అనుకరించాడు. దాంతో అక్కడ మరోసారి నవ్వుల వాతావరణం ఏర్పడింది. దీన్ని కూర్చిలో కూర్చుని దూరంగా ఉండి గమనిస్తున్న కోహ్లి సైతం నవ్వుకుంటూ. రోహిత్‌, జడేజా మీరు ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నించాడు. బీసీసీఐ విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం ట్విట్టర్లో షికారు కొడుతుంది. మా రోహిత్ కి, కోహ్లీకి ఏ విబేధాలు లేవంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: