భారతీయులకు దీపావళి చాలా ముఖ్య మైన పండుగ . ఇంకా చెప్పాలంటే మనం దేశం లో ఎక్కువ మంది జరుపుకునే పండుగగా దీనిని మనం చెప్పుకోవచ్చు. మన దేశం లో కాకుండా ఇతర దేశాల్లో ప్రవాస భారతీయులు కూడా దీపావళి ని ఘనంగా జరుపుకుంటారు. బ్రిటన్ అయితే  అయితే దీపావళి రోజున భారతీయుల కోసం పబ్లిక్ హాలిడే ఇవ్వడానికి కూడాఆలోచిస్తుంది. జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. 

Image result for deepavali

జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందం లోప్రజలు దీపావళిచేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది.

Image result for deepavali

చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: