మన సినీ ఇండస్ట్రీలో తండ్రిని మించిన తనయుడుగా చాలా మంది పేర్లు తెచుకున్నారు. అప్పటి లో మన సీనియర్ ఎన్టీఆర్ ఎన్నో సినిమాలలో నటించారు. అలాగే తన తనయుడు అయిన నందమూరి బాలకృష్ణ కూడా చిన్నతనంలోనే ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కూడా తన తనయుడు అయిన నందమూరి మోక్షజ్ఞను కూడా సినిమా హీరోని చేద్దామని అనుకుంటున్నారు. బాలకృష్ణనే గాక ఆయన అభిమానులు మరియు సినీ ప్రేక్షకులు కూడా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.మోక్షజ్ఞను 2017లోనే హీరోగా పరిచయం చేయాలని బాలకృష్ణ అనుకున్నారు.


కానీ మోక్షజ్ఞకు మాత్రం నటన పై ఆసక్తి లేదని తన బిజినెస్ మెన్ గా ఎదగాలన్న ఆలోచనలో ఉన్నారని వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా నందమూరి మోక్షజ్ఞ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ లుక్ లో మోక్షజ్ఞ చాలా లావుగా ఉన్నారని హీరోలా అసలు కనిపించడం లేదని సాధారణంగా హీరో కావాలనుకున్న స్టార్ కిడ్స్ ఫిజిక్, డ్రస్ సెన్స్ విషయంలో ఆధర్శపూర్వకంగా రెడీ అయి, యూత్ లో ఫాలోయింగ్ పెంచుకునే పనిలో ఉంటారు. కానీ మన మోక్షజ్ఞ మాత్రం దీనికి భిన్నంగా ఉన్నారు.

అయినప్పటికీ బాలకృష్ణ మాత్రం మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయాల తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేక పూజల్లో పాల్గొనటమేగానిక, కుమారుడితో కలిసి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా పుల్లేటికుర్ర గ్రామానికి వచ్చిన బాలకృష్ణ శ్రీ చౌడేశ్వరి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడంతో పాటు, ప్రముఖ సిద్ధాంతి కారుపర్తి నాగమల్లేశ్వర ఆధ్వర్యంలో, స్వామి వారికి చండీ హోమం, సుధర్శన హోమం, రుద్రాభిషేకం చేయించారు.


కానీ ఈ కార్యక్రమాన్ని ఎంతో రహస్యంగా సాగిపోయేలా చేశారు.బాలకృష్ణ వస్తున్నారన్న విషయం ముందుగానే తెలియడం వల్ల పోలీసులు అక్కడ ఎంతో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మీడియా వాళ్లను కూడా ఆలయంలోకి ప్రవేశింపనివ్వలేదు.ఈ కార్యక్రమం అనంతరం బాలకృష్ణ మరియు మోక్షజ్ఞ వేర్వేరు వాహనాల్లో వెళ్లిపోయారు తన కుమారుడిని ఒక నటుడిగా చూడాలనే కోరిక తోనే బాలకృష్ణ ఈ పూజలు నిర్వహించారని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: