బీ ఫార్మసీ స్టూడెంట్ సోనిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ రవిశేఖర్ ఎవరు..? కిడ్నాప్ లు చేయడంలో ఆరితేరిన వాడా..! ఇలాంటి దారుణాలు ఇంతకు ముందు పాల్పడ్డాడంటే, ఈ నిందితుని ఫోటోలు చూసిన కొందరు గతంలో తాము మోసపోయామని వాపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు పోలీస్ స్టేషన్ లో గత నెల 28న ఓ కేసు నమోదైంది.కార్లో లిఫ్టిచ్చిన పరిచయంతో ఇంటికొచ్చి సీబీఐ అధికారినంటూ మోసగించి 54 వేల రూపాయలతోపాటు ఒక మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లాడు.అతని చేతిలో మోసపోయిన నితిన్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో భద్రాచలంలోని ఓ షాపులో సీసీ టీవీ పుటేజ్ లను సేకరించి దర్యాప్తు చేపట్టారు. సరిగ్గా నెల తర్వాత హైదరాబాద్ లో సరైన కిడ్నాప్ చేశారంటూ వార్త ప్రసారం కావడంతో బాధితుడు నితిన్ ఖంగుతిన్నాడు.


ఇదిలా వుంటే సోనీ కిడ్నాప్ మిస్టరీ వీడలేదు. కిడ్నాపర్ రవిశేఖర్ పై గతంలో కేసులుండటం అతని చేతిలో మోసపోయిన బాధితులు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తూ ఉండటంతో సోనీ కిడ్నాప్ వ్యవహారం పోలీసులకు సవాల్ గా మారింది.వారం రోజులైనా ఈ చిక్కుముడి వీడకపోవడంతో ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టారు పోలీసులు. కిడ్నాప్ కు గురైన సోనీ కేసులో పోలీసులకు కొన్ని క్లూస్ లభించాయి.సోనీని కిడ్నాప్ చేసి కర్నూల్ వైపు తీసుకెళ్లినట్టు పలు సీసీ టీవీ కెమెరాల్లో కనిపించింది. అయితే అతని ఆనవాళ్లు నల్లమల అడవుల్లోని ఓ ప్రాంతంలో ఉన్నట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఏపీ పోలీసుల సహకారంతో తెలంగాణ పోలీసులు నల్లమల అడవుల్లో గాలిస్తున్నారు.



ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ రవిశేఖర్ ను పట్టిస్తే లక్ష రూపాయల రివార్డును హైదరాబాద్ లోని రాచకొండ పోలీసులు ప్రకటించారు.అతనికి సంబంధించిన పలు ఫోటోలను విడుదల చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో బొంగులూరు గేట్ దగ్గర చిన్న హోటల్ తో జీవనాన్ని సాగిస్తున్నాడు యాదయ్య అనే వ్యక్తి. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. వారం రోజుల క్రితం హోటల్ కి వచ్చిన రవిశేఖర్ తాను డాక్టర్ నని సోనీకి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కారులో తండ్రి కూతుర్ని సిటీలో తిప్పాడు. సోనీ సర్టిఫికెట్ లు కావాలని చెప్పి యాదయ్యనింటికి పంపించాడు ఆ వ్యక్తి. తాను మోసపోయానని తెలుసుకున్న యాదయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: